Ram Charan vs Janhvi Kapoor: రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లలో ఎవరు ఎక్కువ రిచ్ ? ఎవరి ఆస్తి ఎంత?

Published : May 23, 2026, 12:30 PM IST

రీసెంట్ గా 'పెద్ది' సినిమా ట్రైలర్ రిలీజై భారీ రెస్పాన్స్ ను సాధిస్తోంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.  ఇక రామ్ చరణ్ జాన్వీ కపూర్ లో ఎవరు ఎక్కువ ధనవంతులో తెలుసా? Ram Charan vs Janhvi Kapoor Net Worth

PREV
16
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న 'పెద్ది' సినిమా కోసం అబిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా సందర్భంగా, రామ్ చరణ్, జాన్వీల ఆస్తుల వివరాలు చూద్దాం.

26
రామ్ చరణ్ ఆస్తి ఎంత?

ముందుగా రామ్ చరణ్ ఆస్తి గురించి చూద్దాం. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, రామ్ చరణ్ నికర ఆస్తి విలువ రూ.1500 కోట్లు. ఆయన సంపాదనలో ఎక్కువ భాగం సినిమాల నుంచే వస్తుంది. ఒక్కో సినిమాకు 70 కోట్ల వరకూ  తీసుకుంటుంన్నారట.  అయితే, 'పెద్ది' కోసం రూ.100 కోట్లు పారితోషికం తీసుకున్నారని సమాచారం. పలు పెద్ద బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉంటూ భారీగా సంపాదిస్తున్నారు. పలు వ్యాపారాలలో పెట్టుబడుటు కూడా పెట్టారు. 

36
హైదరాబాద్, ముంబయ్ లో ఇళ్లు..
రామ్ చరణ్‌కు హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ విలాసవంతమైన బంగ్లా ఉంది. దీని విలువ సుమారు రూ.38 కోట్లు. ఇందులో ప్రైవేట్ జిమ్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, బేస్‌మెంట్‌లో ఒక పెద్ద గుడి కూడా ఉన్నాయి. ముంబైలోని ఖార్ ఏరియాలో సముద్రానికి అభిముఖంగా ఉండే ఒక పెంట్‌హౌస్ కూడా ఆయనకు ఉంది.
46
రామ్ చరణ్ వ్యాపారాలు..
రామ్ చరణ్ 'హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్' యజమాని. ఆయనకు 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' పేరుతో సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. గతంలో హైదరాబాద్‌కు చెందిన 'ట్రూజెట్' (TruJet) ఎయిర్‌లైన్ కంపెనీకి కూడా ఆయన యజమానిగా ఉన్నారు.
56
జాన్వీ కపూర్ ఆస్తి ఎంత?
'పెద్ది' హీరోయిన్ జాన్వీ కపూర్ ఆస్తి విలువ రూ.82 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉంటుంది. రామ్ చరణ్‌తో పోలిస్తే జాన్వీ ఆస్తి చాలా తక్కువ. ఆమె ఎక్కువగా సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ప్రకటనల ద్వారా సంపాదిస్తారు. ఒక్కో సినిమాకు ఆమె రూ.5-6 కోట్లు ఛార్జ్ చేస్తారు.
66
ముంబయ్, చెన్నైలో ఇళ్లు..

జాన్వీ కపూర్‌కు ముంబైలోని బాంద్రాలో సుమారు రూ.65 కోట్ల విలువైన విలాసవంతమైన డూప్లెక్స్ ఉంది. ఇది కాకుండా, చెన్నైలో ఆమెకు ఒక పెద్ద ఫామ్‌హౌస్ కూడా ఉంది. కోట్లు విలువ చేసే వానిటీ వ్యాన్ కూడా ఆమె సొంతం. 

Read more Photos on
click me!

Recommended Stories