ఇటలీ బయలుదేరిన రామ్ చరణ్‌ - ఉపాసన, రొమాంటిక్ ప్లేస్ లో పదోవ పెళ్లి రోజు

Published : Jun 10, 2022, 08:01 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన పెళ్ళి రోజువేడుకలు చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. దాని కోసం వారు ఇటలీ బయలుదేరారు. అక్కడ రొమాంటిక్ ప్లేస్ లో తమ ప్రేమ మధురిమలు పంచుకోబోతున్నాను. 

PREV
16
ఇటలీ బయలుదేరిన రామ్ చరణ్‌ - ఉపాసన, రొమాంటిక్ ప్లేస్ లో పదోవ పెళ్లి రోజు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు వివాహ బంధానికి పదేళ్లు. వీరిద్దరు పదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇన్నేళ్ల వీరి వైవాహిక జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచింది. అనుక్షణం ఆప్యాయతానురాగాలను పంచుకుంటూ ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవీతాన్ని గడిపారు ఇద్దరు స్టార్లు.  

26

ఇక తమ మ్యారీడ్ లైఫ్ కు పదేళ్ళు వచ్చిన సందర్భంగా.. ఇద్దరు రొమాంటిక్ ప్లేస్ లు చుట్టిరావాలి ని నిర్ణయించుకున్నారు. అందుకే ఫారెన్ వెళ్ళారు. తమ జీవితంలోని ఈ అద్భుతమైన ఘడియలను సంతోషంగా పంచుకోవడానికి ఇద్దరూ ఇటలీకి బయల్దేరారు. 

36

వీరిద్దరు ఇటలీకి  బయల్దేరుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటలీలో రొమాంటిక్ ప్లేస్ లను చుట్టిరాబోతున్నారు రామ్ చరణ్, ఉపాసన. అక్కడే తమజీవితంలో ఎంతో ముఖ్యమైన పదోవ పెళ్ళి రోజును జరుపుకోబోతున్నారు ఈ జంట.ఆ దేశంలో ప్రఖ్యాత నగరాల్లో ఒకటైన మిలాన్ నగరం ఆహ్లాదంగా గడపనున్నారు.

46

రామ్ చరణ్-ఉపాసనల వివాహానికి పదేళ్లు. జూన్ 14, 2012లో వీరి పెళ్లి అతిరథ మహారథుల మధ్య ఘనంగా జరిగింది. ఈ ఏడాదితో చరణ్ ఉపాసన చేయి అందుకొని పదేళ్లు. 

56

ఉపాసన.. రామ్ చరణ్ కు క్లాస్ మెట్. ఇద్దరు స్నేహితుల నుంచి ప్రమేమికులుగా మారి.. పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. రామ్ చరణ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లో స్టార్ అయితే.. ఉపాసన వ్యాపారవేత్త.
 

66

ఇన్నేళ్ల వీరి వివాహ జీవితంలో పిల్లలు లేరు అన్న లోటు తప్ప.. ఇంత వరకూ ఎటువంటి అలమరికలులేకుండా తమ వివాహ జీవితాన్ని గడుపుతున్నారు ఇద్దరు. ఒకరికి ఒకరుఅన్నట్టు బ్రతుకున్నారు. చాలా సందర్భాల్లో ఒకరి గురుంచి మరొకరు గొప్పగా చెప్పుకున్నసందర్భాలు చాలా ఉన్నాయి. 

click me!

Recommended Stories