రిలీజ్ కు రెడీ అవుతున్న పెద్ది..
పెద్ది సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ఆమె పాత్ర కూడా ఆసక్తికరంగా ఉండబోతుందని సమాచారం. ఆమె పాత్ర సినిమా కథలో కీలకంగా నిలుస్తుందని టాక్. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ‘పెద్ది’ సినిమా భారీ స్థాయిలో నిర్మితమవుతోంది.
కథ, టేకింగ్, మ్యూజిక్, యాక్షన్ వంటి అన్ని విభాగాల్లో ఈ చిత్రం కొత్త ప్రమాణాలు సృష్టించే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే టీజర్‌తోనే భారీ బజ్ క్రియేట్ చేసిన ‘పెద్ది’, విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.