అల్లు అర్జున్ లో రామ్ చరణ్ కు నచ్చిన క్వాలిటీ ఏదో తెలుసా? ఆ విషయంలో బన్నీ బెస్ట్ అంటున్న గ్లోబల్ స్టార్

అల్లు అర్జున్, రామ్ చరణ్ బావ బామ్మర్ధులు, మెగా ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా హీరోలుగా ఉన్న ఈ స్టార్స్  కలిసి ఒకే కుటుంబంలో పెరిగారు. మొదటి నుంచి కలిసి మెలిసి ఉన్న ఈ హీరోల మధ్య ప్రస్తుతం మనస్పర్ధలు వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే కొన్ని సంఘటనలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ లో రామ్ చరణ్ కు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటో తెలుసా? రామ్ చరణ్ స్వయంగా వెల్లడించిన విషయం ఏంటంటే? 
 

Ram Charan reveals the best quality he likes in Allu Arjun in telugu jms

మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా పరిచయం అయ్యారు రామ్ చరణ్, అల్లు అర్జున్. ఈ ఇద్దరు హీరోలు తమ సొంత టాలెంట్ తో టాలీవుడ్ లో స్టార్లుగా ఎదిగి చూపించారు. అంతే కాదు పోటా పోటీగా పాన్ ఇండియా హరో హోదాను కూడా సాధించారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తో అద్భుతం సాధించి ఆస్కార్ రేంజ్ కు వెళ్ళగా.. పుష్ప సినిమాలతో ఇండియాన్ సినిమా హిస్టరీని తిరగ రాశాడు అల్లు అర్జున్. ఇలా ఇద్దరు హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా వెలుగు వెలుగుతున్నారు. 

Ram Charan reveals the best quality he likes in Allu Arjun in telugu jms

ఈక్రమంలో మెగా ఫ్యామిలీలో లుకలుకలు గురించి ఇప్పటికీ జరుగుతున్న చర్చల గురించి తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్లు ఒకరి బర్త్ డేలకు మరొకరు విష్ చేసుకోవడం కూడా మానేశారు. అంతే కాదు రీసెంట్ గా అల్లు అర్జున్ కేసులతో ఇబ్బందిపడుతున్న టైమ్ లో కూడా ఇండస్ట్రీ అంతా పలకరించినా.. రామ్ చరణ్ మాత్రం అఫీషియల్ గా బన్నీని పలకరించినట్టు తెలియలేదు. దాంతో వీరి మధ్య గొడవలు ఎంత ముదిరాయో అర్ధం చేసుకోవచ్చు. 


అయితే గతంలో బాగానే ఉన్న ఈ స్టార్స్ ఇప్పుడు మాత్రం ఎడమోహం, పెడమోహంగా ఉంటూ వస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లో రామ్ చరణ్ కు నచ్చే క్వాలిటీ ఏంటో తెలుసా? రామ్ చరణ్ ఈ విషయాన్ని ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించారు. రామ్ చరణ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సీనియర్ నటి జయప్రద హోస్ట్ గా జరిగిన జయప్రదం కార్యక్రమంలో చరణ్ చాలా విషయాలు పంచుకున్నారు. ఈసందర్భంతా జయప్రద కొన్ని విషయాలు అడిగారు 

Ram Charan - Allu Arjun

అల్లు అర్జున్ లో మీకు నచ్చేక్వాలిటీ ఏంటి అని చరణ్ కు ప్రశ్న ఎదురవ్వగా.. బన్నీలో హానెస్టీ తనకు నచ్చుతుంది అన్నారు. మనసులో ఏది ఉండదు.  ఏది జరిగినా అప్పటికప్పుడు వదిలేస్తాడు దాన్ని క్యారీ చేయడు. ఆ క్వాలిటీ తనకు బాగా నచ్చుతుంది అన్నారు రామ్ చరణ్. అప్పట్లో జరిగిని ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మళ్ళీ ఈ ఇద్దరు హీరోలు కలిసిపోతే బాగుండు అని కోరకుంటున్నారు మెగా ఫ్యాన్స్. 
 

ఇక మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. ఈమూవీ నుంచి వరుసగా వచ్చిన అప్ డేట్స్ ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేశాయి. ఈసినిమాకు సుకుమార్ కథ అందిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ స్వారాలు సమకూరుస్తున్న ఈసినిమా వచ్చ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈసినిమా తరువాత రామ్ చరణ్ సుకుమార్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్  చేస్తున్నాడు.

ఇక  అల్లు అర్జున్ గురించి తెలిసిందే. పుష్ప సీక్వెల్స్ కు బ్రేక్ ఇచ్చి.. అట్లీతో సినిమా చేయబోతున్నాడు. 800 కోట్ల భారీ బడ్జెటన్ తో పాన్ వరల్డ్ స్థాయిలో ఈమూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఈసినిమా చేస్తూనే త్రివిక్రమ్ తో తో కూడా మూవీ చేయబోతున్నాడట బన్నీ. ఆతరువాత పుష్ప3 గురించి ఆలోచించబోతున్నట్టు సమాచారం. 

Latest Videos

vuukle one pixel image
click me!