ఆ మూవీలో నటించకుండా ఉండాల్సింది, పెద్ద తప్పు చేశా..ఇన్నేళ్లకి ఓపెన్ అయిన రాంచరణ్, హీరోయిన్ తో తిట్లు

First Published | Jan 8, 2025, 7:45 AM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్ర హంగామా గురువారం రాత్రి నుంచి మొదలు కాబోతోంది. జనవరి 10న రిలీజ్ అవుతున్న ఈ చిత్ర ప్రీమియర్ షోలు 9వ తేదీనే ప్రారంభం కాబోతున్నాయి.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్ర హంగామా గురువారం రాత్రి నుంచి మొదలు కాబోతోంది. జనవరి 10న రిలీజ్ అవుతున్న ఈ చిత్ర ప్రీమియర్ షోలు 9వ తేదీనే ప్రారంభం కాబోతున్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రాంచరణ్ కి ఇది పెద్ద పరీక్ష. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కడం, ఇటీవల ఆయనకి సరైన సక్సెస్ లేకపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. 

రాంచరణ్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కోసం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 లో పాల్గొన్నారు. బాలయ్య, రాంచరణ్ మధ్య అనేక సరదా విషయాలు చర్చకి వచ్చాయి. అదే విధంగా కొన్ని సీరియస్ ప్రశ్నలని కూడా బాలయ్య రాంచరణ్ కి సంధించారు. నీ కెరీర్ లో రిగ్రెట్ గా ఫీల్ అయిన చిత్రం ఏంటి అని బాలకృష్ణ ప్రశ్నించారు. 


రాంచరణ్ వెంటనే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. బాలీవుడ్ లోకి డెబ్యూ చేయాలి అనే ఉద్దేశంతో జంజీర్ రీమేక్ లో నటించాను. నా కెరీర్ లో చేసిన అతి పెద్ద తప్పు అదే. ఆ మూవీలో నటించకుండా ఉండాల్సింది అని ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది అని చరణ్ తెలిపాడు. అమితాబ్ బచ్చన్ క్లాసిక్ మూవీ జంజీర్ చిత్రాన్ని రాంచరణ్ రీమేక్ చేయగా భారీ డిజాస్టర్ అయింది. అపూర్వ లఖియా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రాంచరణ్ కి జంటగా ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించింది. 

జంజీర్ చిత్రం వల్ల రాంచరణ్ కి ఒక్క పాజిటివ్ అంశం కూడా లేదు. మూవీ ఫ్లాప్ కావడం, అదే విధంగా చరణ్ నటనపై తీవ్ర విమర్శలు రావడం కూడా జరిగింది. బాలీవుడ్ క్రిటిక్స్ చరణ్ నటనని తీవ్రంగా విమర్శించారు. ప్రియాంక చోప్రా కూడా అప్పట్లో చరణ్ పట్ల నెగిటివ్ కామెంట్స్ చేసింది. చరణ్ షూటింగ్స్ తో పాటు, ప్రమోషనల్ ఈవెంట్ కి కూడా ఆలస్యంగా వచ్చేవాడు అంటూ ప్రియాంక చోప్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. చరణ్ వల్ల తాను అనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ చేయలేకపోయేదాన్ని. దీనితో తన ఇతర చిత్రాలు ఎఫెక్ట్ అయ్యేవి అని ప్రియాంక అప్పట్లో కామెంట్స్ చేసింది. 

ఆర్ఆర్ఆర్ తర్వాత తిట్టిన నోటితోనే ప్రియాంక చోప్రా రాంచరణ్ పై ప్రశంసలు కురిపించింది. రాంచరణ్ ని పీసీ బాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ తో పోల్చింది. ఇండియన్ సినిమాకి బ్రాండ్ పిట్... అతడు చాలా హ్యాండ్సమ్ అంటూ పొగడ్తలు కురిపించింది. 

Latest Videos

click me!