Sridevi: ఐటమ్ గర్ల్ స్టైల్ ను కాపీ కొట్టిన శ్రీదేవి, స్టార్ హీరోయిన్లు కూడా ఇమిటేట్ చేసే డ్యాన్సర్, బాలయ్య చెప్పిన బ్యూటీ ఎవరో తెలుసా?

Published : Jul 11, 2026, 07:00 AM IST

Sridevi: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు తక్కువ కాదు.. టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసిరాక వెనకబడినవారు ఎందరో ఉన్నారు. అటువంటి వారిని స్టార్ హీరోయిన్లు కాఫీ కొట్టి, ఫాలో అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. శ్రీదేవితో పాటు హీరోయిన్లు ఫాలో అయిన ఐటమ్ గర్ల్ ఎవరు? 

PREV
16
టాలెంట్ తో పాటు లక్కు కూడా అవసరం..

ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ , అందం, నటన అన్నీ ఉండి.. లక్కు కలిసిరాక మరుగున పడిపోయిన వారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లలో స్టార్లుగా వెలిగిన వారు కూడా వారికంటే స్టేటస్ లో తక్కువగా ఉన్న నటీమణుల స్టైల్ ను ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయి. అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఇలానే ఐటమ్ సాంగ్స్ చేసుకునే ఓ హీరోయిన్ లుక్ ను, స్టైల్ ను ఫాలో అయ్యేదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ వెల్లడించారు. ఆ ఐటమ్ సాంగ్స్ స్టార్ ఎవరో కాదు సిల్క్ స్మిత.

26
సిల్క్ స్మిత పేరు కాదు సంచలనం..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 'సిల్క్ స్మిత' అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, ఒక పెద్ద సంచలనం. ఎనభై, తొంభైల కాలంలో ఆమె సృష్టించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. సాధారణంగా ఆమెను కేవలం ఐటమ్ సాంగ్స్, డ్యాన్సులకే పరిమితం చేసి చూసినప్పటికీ, ఆమెలో ఒక అద్భుతమైన నటి కూడా ఉంది. ఈ విషయాన్ని నందమూరి బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'ఆదిత్య 369' సినిమా అనుభవాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంటూ.. ఈ విషయాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

36
సిల్క్ పై బాలయ్య ప్రశంసలు..

ఆదిత్య 369 సినిమాలో సిల్క్ స్మితకు ఒక ఫుల్ లెన్త్ కలిగిన నెగటివ్ షేడ్స్ ఉన్న సింహ నందిని పాత్రను ఇచ్చారు. ఆ పాత్రకు ఆమె మాత్రమే న్యాయం చేయగలదని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు భావించారు. బాలకృష్ణ మాటల్లో చెప్పాలంటే, సిల్క్ స్మిత సహజసిద్ధమైన అందం, ఆమె 'టాన్ లుక్' (మురజల్ ఫేస్), ఆమె మేకప్, కాస్ట్యూమ్స్ సెలెక్షన్ ఆ చారిత్రక కథకు ఎంతో అద్భుతమైన కాంట్రాస్ట్ తీసుకొచ్చాయి.

46
శ్రీదేవి కూడా ఆమె స్టైల్ ను ఫాలో అయ్యేదా?

సిల్క్ స్మిత స్టైల్ ఎంత ప్రత్యేకం అంటే.. అప్పట్లో శ్రీదేవి లాంటి ఎంతో మంది స్టార్ హీరోయిన్లు సైతం ఆమెను అనుకరించేవారని (ఇమిటేట్ చేసేవారని) బాలయ్య స్వయంగా వెల్లడించారు. సిల్క్ స్మిత వేసుకునే బట్టలు, ఆమె మేకప్ స్టైల్, ఆమె చీక్ హైలైట్స్ వంటి విషయాలను స్టార్ హీరోయిన్లు ఎప్పుడూ గమనిస్తూ ఉండేవారట. ఆమెలాగే ఫాలో అయ్యేవారట. ఆమెకు ఒక దశలో హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ ఉండేది.

56
సిల్క్ స్మిత కోసమే థియేటర్లకు వెళ్లే ఆడియన్స్..

సిల్క్ స్మిత క్రేజ్ ఎలా ఉండేదంటే, ఆమె ఏదైనా సినిమాలో ఐటమ్ సాంగ్ చేసినా.. ఏదైనా పాత్ర చేసినా.. ఆమె కోసమే థియేటర్లకు వచ్చే ఆడియన్స్ ప్రత్యేకంగా ఉండేవారు. షూటింగ్ సమయంలో ఆమె ఎంత ప్రొఫెషనల్ గా ఉండేదో బాలయ్య ఒక సరదా సంఘటన ద్వారా వివరించారు. ఒక ఎమోషనల్ సీన్‌లో ఆమెకు పెద్ద తెలుగు డైలాగ్ ఉంది. తెలుగు అంతగా రాకపోయినప్పటికీ, ఆ ఎమోషన్‌లో పడిపోయి తెలుగు పదాలు మర్చిపోయినా.. సీన్‌ను ఆపకుండా "This fool, this idiot, this bastard, this rascal" అంటూ ఒకే ఊపులో ఇంగ్లీష్ లో తిట్టేసి, ఆ క్యారెక్టర్‌ను అద్భుతంగా పండించిందట.

66
కొత్త ట్రెండ్‌ సెట్ చేసిన తార..

ఈ విధంగా ఒక డాన్సర్‌గానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేకమైన మేకప్, కాస్ట్యూమ్ స్టైల్ ని క్రియేట్ చేసుకుని, తోటి స్టార్ హీరోయిన్లు కూడా తనను చూసి నేర్చుకునే స్థాయికి ఎదగడం సిల్క్ స్మిత క్రేజ్‌కు నిదర్శనం. ఆమె కేవలం గ్లామర్ మాత్రమే కాదు, తెరపై ఆమె చూపించే మేనరిజమ్స్, శైలి కూడా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేశాయి.

Read more Photos on
click me!

Recommended Stories