రామ్‌చరణ్‌ నెక్ట్స్ ప్రాజెక్ట్ అదేనా ?.. టాలీవుడ్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారిన కాంబినేషన్‌లో నిజమెంతంటే?

Published : Nov 05, 2022, 06:00 PM ISTUpdated : Nov 05, 2022, 07:02 PM IST

రామ్‌ చరణ్‌ నెక్ట్స్ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా మరో హాట్‌ న్యూస్‌ తెరపైకి వచ్చింది.  టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గానూ మారింది. 

PREV
16
రామ్‌చరణ్‌ నెక్ట్స్ ప్రాజెక్ట్ అదేనా ?.. టాలీవుడ్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారిన కాంబినేషన్‌లో నిజమెంతంటే?

రామ్‌చరణ్‌ నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. అనుకున్న ప్రాజెక్ట్ లు సెట్‌ కాకపోవడంతో రోజుకో కొత్త డైరెక్టర్‌ తెరపైకి వస్తున్నారు. కానీ ఏది క్లారిటీ లేదు. ప్రస్తుతం చరణ్‌.. పాన్‌ ఇండియా డైరెక్టర్‌ శంకర్‌ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. `ఆర్‌సీ15` అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. 
 

26

నిజానికి ఈ సినిమా తర్వాత చరణ్‌.. `జెర్సీ` ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. కానీ కథ విషయంలో సంతృప్తి చెందని చరణ్‌ నో చెప్పారట. పైగా చెర్రీ పాన్‌ ఇండియా రేంజ్‌ సినిమాలు చేస్తున్న నేపథ్యంలో గౌతమ్‌ కథ ఆ స్థాయిలో లేకపోవడంతో పక్కన పెట్టినట్టు సమాచారం. దీంతో విజయ్‌ దేవరకొండ- గౌతమ్‌ తిన్ననూరి  కాంబినేషన్‌లో ఈ సినిమా రాబోతుందని సమాచారం. 

36

ఈ వార్త రాగానే చరణ్‌కి సంబంధించిన మరో వార్త నెట్టింట్లో హల్‌చల్‌ చేసింది. బుచ్చిబాబు డైరెక్షన్‌ సినిమా చేయబోతున్నారని వినిపించింది. బుచ్చిబాబు, ఎన్టీఆర్‌ కలిసి ఓ సినిమా చేయాల్సి ఉంది. కథ విషయంలో సాటిస్ఫైగా లేని తారక్‌ బుచ్చిబాబు స్టోరీని పక్కన పెట్టారట. దీంతో ఆ కథతో చరణ్‌తో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. శంకర్‌ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ లేకపోవడంతో బుచ్చిబాబుకి చెర్రి ఓకే చెప్పారని తెలుస్తుంది. వీరితోపాటు `విక్రమ్‌` ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌, `గాడ్‌ ఫాదర్‌` ఫేమ్‌ మోహన్‌రాజాలతో సినిమాలు చేయబోతున్నట్టు రూమర్స్‌ వచ్చాయి. 
 

46

ఇదిలా ఉంటే చరణ్‌ కొత్త సినిమాకి సంబంధించి ఇంకోవార్త కూడా కొన్ని రోజులుగా హల్‌చల్‌ చేస్తుంది. సుకుమార్‌తో చరణ్‌ సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓపెనింగ్‌ ఎపిసోడ్‌ కూడా షూటింగ్‌ చేశారనే వార్త ఇటీవల వైరల్‌ అయ్యింది. `పుష్ప2` సినిమా పూర్తయ్యాక చరణ్‌తో సుకుమార్‌ సినిమా చేస్తారని లేటెస్ట్ టాక్‌. దీనికి ఇంకాస్త ఎక్స్ టెన్షన్‌ వార్త ఇప్పుడు నెట్టింట వినిపిస్తుంది. సుకుమార్‌, వివేక్‌ అగ్నిహోత్రి, అభిషేక్‌ అగర్వాల్‌ కాంబినేషన్‌లో శుక్రవారం ప్రాజెక్ట్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. 

56

ఈ కాంబినేషన్‌ సినిమాలో హీరో రామ్‌చరణ్‌ అనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. సుకుమార్‌, వివేక్‌ అగ్నిహోత్రి, అభిషేక్‌ అగర్వాల్‌ చేసే సినిమాలో చరణే హీరో అంటూ ప్రచారం ఊపందుకుంది. మరి సుకుమార్‌- చరణ్‌ కాంబినేషన్‌లో చేయబోయే సినిమాని అభిషేక్‌ అగర్వాల్‌, వివేక్‌ అగ్నిహోత్రి నిర్మిస్తారా? లేక ఇది కొత్త ప్రాజెక్ట్ గా రాబోతుందా? అనేది సస్పెన్స్ గా మారింది. కానీ ఇప్పుడీ వార్తలు అటు ఫిల్మ్ నగర్‌లో, ఇటు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

66

ఇదిలా ఉంటే అసలు ఈ ప్రాజెక్ట్ లోనే క్లారిటీ లేదనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అభిషేక్‌, వివేక్‌ అగ్నిహోత్రిలతో సుకుమార్‌ కలవడమనేది జరగదని, అది బేస్‌ లేని ప్రాజెక్ట్ అనే కామెంట్లు చిత్ర వర్గాల నుంచి వినిపిస్తుండటం గమనార్హం. ఆర్ట్ సినిమాలు చేసే టీమ్‌తో పాన్‌ ఇండియా కమర్షియల్‌ చిత్రాలు చేసే సుకుమార్‌ కలవడమనేది సాధ్యం కాదని అంటున్నారు. కేవలం సుకుమార్‌ని ఆ ఇద్దరు కలిసిన సందర్బంగా మాట్లాడుకున్న మాటనే గానీ, ఇది కార్యరూపం దాల్చేంతటి సీరియస్‌ నెస్‌ ఇందులో లేదని అంటున్నారు. మరి ఏది నిజం, మున్ముందు ఏం జరగబోతుందనేది వేచి చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories