ఒరేయ్ చరణ్ నువ్వు నా ఫ్రెండా, శత్రువా.. ప్రభాస్ కొంప ముంచిన మెగా పవర్ స్టార్, ప్రోమో స్టఫ్ అదుర్స్

First Published Dec 17, 2022, 7:15 PM IST

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో సీజన్ 2 ఆల్రెడీ గ్రాండ్ స్టైల్ లో ప్రారంభం అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ గురించి అందరిలో అంతులేని ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హాజరవుతున్నారు.

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో సీజన్ 2 ఆల్రెడీ గ్రాండ్ స్టైల్ లో ప్రారంభం అయింది. సీజన్ 2 ప్రారంభ ఎపిసోడ్ కి మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ హాజరైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎపిసోడ్ కి యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ అతిథులుగా హాజరయ్యారు.శర్వానంద్, అడివి శేష్ కూడా హాజరైన సంగతి తెలిసిందే. 

నెక్స్ట్ ఎపిసోడ్ గురించి అందరిలో అంతులేని ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హాజరవుతున్నారు. ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా బాలయ్యతో కలసి సందడి  చేయబోతున్నాడు.  ఈ క్రమంలో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ ఎపిసోడ్ ప్రోమో విడుదలయింది. 

అదిరిపోయే స్టఫ్ తో ప్రోమో కట్ చేశారు. ఈ ప్రోమోలో చాలా విశేషాలు ఉన్నాయి. బాలయ్య ప్రభాస్ కి మహారాజు తరహాలో ఘనస్వాగతం పలికాడు. ప్రభాస్ నామధేయస్య.. బహుపరాక్ బహుపరాక్ అంటూ ప్రభాస్ కి బాలయ్య స్వాగతం పలికాడు.ప్రభాస్ ఎంట్రీ తర్వాత బాలకృష్ణ అసలైన హంగామా మొదలు పెట్టాడు. 

సభాముఖంగా ప్రేమగా అడుగుతున్నా.. నన్ను కూడా నువ్వు డార్లింగ్ అని పిలవాలి అని బాలయ్య ప్రభాస్ ని అడిగాడు. దీనితో ప్రభాస్.. సరే డార్లింగ్ సర్ అని అన్నాడు. ఇక బాలయ్య ప్రభాస్ ని పెళ్లి కబుర్లతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు. మొన్నామధ్యన శర్వానంద్ వచ్చాడు. పెళ్ళెప్పుడు అని అడిగితే ప్రభాస్ తర్వాత అని చెప్పాడు. 

దీనికి ప్రభాస్ బదులిస్తూ అయితే నేను సల్మాన్ ఖాన్ తర్వాత అని చెప్పాలేమో అని అన్నాడు. నీ లైఫ్ లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏంటి అని అడిగితే సమాధానం చెప్పడానికి ప్రభాస్ సిగ్గుపడిపోయాడు. ఆ రోజుల్లో మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ మాకు అనవసరమైన గోల ఎక్కువ అని గాసిప్స్ గురించి ప్రభాస్ ఫన్నీగా చెప్పాడు. ఆరోజుల్లో మేము సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేసేవాళ్ళమో తెలుసా అని బాలయ్య అనగా.. అయితే ఎన్ని న్యూస్ లు వచ్చి ఉంటాయో అని ప్రభాస్ అన్నాడు. దీనితో నవ్వులు పూశాయి. 

ఇంతలో బాలకృష్ణకి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ చేసింది మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రాంచరణ్. రాంచరణ్ బాలయ్య ముందు ప్రభాస్ గురించి ఏదో సీక్రెట్ లీక్ చేసినట్లు ఉన్నాడు. దీనితో ప్రభాస్.. ఓయ్ చరణ్.. రేయ్ నువ్వు నా ఫ్రెండా శత్రువా అంటూ వాపోయాడు. దీనితో ఆడిటోరియం మొత్తం నవ్వులతో మోతెక్కింది. ఆ సీక్రెట్ ఏంటి అనేది.. ఆ తర్వాతా వచ్చిన హీరో గోపీచంద్ హింట్ ఇచ్చాడు. 

 రాంచరణ్ చెప్పింది రాణి గురించే అని గోపీచంద్ తెలిపాడు. అంటే త్వరలో ప్రభాస్ లైఫ్ లోకి ఒక యువరాణి రాబోతోంది అనేది వైరల్ గా మారింది. ఈ పూర్తి ఎపిసోడ్ డిసెంబర్ 30న ప్రసారం కానుంది. 

click me!