అఫీషియల్ గా రాంచరణ్ బిరుదు మార్చేశారు..'మెగా పవర్ స్టార్' ఎగిరిపోయింది, బుచ్చిబాబు మామూలోడు కాదుగా

First Published Mar 22, 2024, 4:21 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రారంభించారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ పూజా కార్యక్రమం ఇటీవల గ్రాండ్ గా జరిగింది. మెగా స్టార్ చిరంజీవి, డైరెక్టర్ శంకర్, అల్లు అరవింద్ అతిథులుగా హాజరయ్యారు. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రారంభించారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ పూజా కార్యక్రమం ఇటీవల గ్రాండ్ గా జరిగింది. మెగా స్టార్ చిరంజీవి, డైరెక్టర్ శంకర్, అల్లు అరవింద్ అతిథులుగా హాజరయ్యారు. బుచ్చిబాబు, రాంచరణ్ తో పాటు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు. 

రంగస్థలం లాగా రస్టిక్ నేచర్ తో ఆ చిత్రానికి పది రెట్లు గ్రాండ్ గా అబ్బురపరిచే సన్నివేశాలతో చాలా వైల్డ్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే రాంచరణ్ అభిమానులు శంకర్ గేమ్ ఛేంజర్ కన్నా ఎక్కువగా బుచ్చిబాబు చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఇంతలా హైప్ రావడానికి కాస్టింగ్ కూడా ఒక కారణం. 

ఈ చిత్ర పూజా కార్యక్రమంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మగధీర నుంచి ఇప్పటి వరకు రాంచరణ్ ని అభిమానులు మెగా పవర్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. సినిమా టైటిల్ కార్డ్స్ లో, పోస్టర్స్ లో రాంచరణ్ పేరు ముందు మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఉండేది. కానీ ఇప్పుడు అది సడెన్ గా ఆగిపోయింది. 

బుచ్చిబాబు చిత్రం RC 16 పూజా కార్యక్రమం నుంచి రాంచరణ్ కి కొత్త ట్యాగ్ ని అఫీషియల్ గా ఖరారు చేశారు. మైత్రి మూవీస్ సంస్థ అఫీషియల్ గా పోస్టర్స్, పూజా కార్యక్రమం వీడియోలలో రాంచరణ్ పేరు ముందు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. 

రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రాంచరణ్ కి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు లభించింది. ఫ్యాన్స్ కూడా గ్లోబల్ స్టార్ రాంచరణ్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. మరి అభిమానుల కోరిక మేరకు నడుచుకున్నారో లేక రాంచరణ్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కి అర్హుడు అని భావించారో తెలియదు కానీ చిత్ర యూనిట్ అధికారికంగా గ్లోబల్ స్టార్ రాంచరణ్ అని అభివర్ణించారు. 

సో ఇంతకాలం అటు నాన్నలోని మెగా, బాబాయ్ లోని పవర్ రెండు కలిపి మెగా పవర్ స్టార్ అనేది చరణ్ కి సెంటిమెంట్ గా వస్తూ ఉండేది. మరి ఈ కొత్త బిరుదు చరణ్ కి ఎంతలా కలసి వస్తుందో వేచి చూడాలి. గేమ్ ఛేంజర్ చిత్ర టైటిల్ వీడియోలో కూడా మెగా పవర్ స్టార్ అనే ఉంది. దీనితో బుచ్చిబాబు మామూలోడు కాదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ బిరుదు కూడా యంగ్ టైగర్ నుంచి మాన్ ఆఫ్ మాసెస్ కి మారింది. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యాడు. 

click me!