కియారా అద్వానీ చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో అడుగుపెట్టారు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో కియారా హీరోయిన్ గా నటించారు. తాజాగా రామ్ చరణ్ కి జంటగా గేమ్ ఛేంజర్ మూవీలో కియారా నటిస్తున్నారు. రామ్ చరణ్ కి జంటగా మరోసారి కియారా నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారం.