సూపర్ స్టార్ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. దీనితో ఆయన లైఫే మారిపోయింది. మరి ఆ సినిమా ఏంటి? ఆ కథేంటి అనేది తెలుసుకుందాం.
కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్
సూపర్ స్టార్ కృష్ణ 1960 నుంచి సినిమాలు చేస్తూ వచ్చారు. ఆయన హీరోగా కెరీర్ పీక్ చూసినప్పుడు చిరంజీవి కనీసం ఇండస్ట్రీలో కూడా లేరు. 1980 నుంచి చిరంజీవి నటుడిగా జర్నీ స్టార్ట్ చేసి మూడేళ్లలోనే స్టార్ అయిపోయాడు. 1990 టైమ్‌లో కెరీర్‌లో పీక్‌ని చూశారు. ఆ సమయంలో కృష్ణ కూడా తిరుగులేని సూపర్ స్టార్‌గా రాణించారు. అయితే కృష్ణ చేయాల్సిన ఒక సినిమా రామ్ చరణ్ చేయడం విశేషం. సూపర్ స్టార్ రిజెక్ట్ చేసిన మూవీతో చరణ్ ఇండస్ట్రీ హిట్‌ని కొట్టాడు. రికార్డులు తిరగరాశారు. కలెక్షన్ల పరంగా టాలీవుడ్‌కి కొత్త మైల్ స్టోన్‌ని సెట్ చేశారు. మరి ఆ సినిమా ఏంటి? ఆ కథేంటనేది చూస్తే.
25
మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చరణ్
రామ్ చరణ్.. `చిరుత` మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2007లో విడుదలైంది. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు చరణ్. ఆ తర్వాత `మగధీర`తో పెద్ద హిట్‌ని అందుకున్నాడు. 2009లో విడుదలైన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు. దీనికి విజయేంద్రప్రసాద్ కథ అందించారు. ఇందులో కాజల్ హీరోయిన్‌గా నటించగా, శ్రీహరి కీలక పాత్ర పోషించారు. పునర్జన్మల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది వంద కోట్లకుపైగా వసూలు చేసింది. టాలీవుడ్‌లో వంద కోట్లు దాటిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు.
35
మగధీర రిజెక్ట్ చేసిన కృష్ణ
ఇదిలా ఉంటే ఈ మూవీ సూపర్‌స్టార్ కృష్ణ చేయాల్సింది. 1996లో కృష్ణ `జగదేక వీరుడు` అనే సినిమా చేశాడు. ఇందులో సౌందర్య హీరోయిన్‌గా నటించింది. సాగర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీకి మొదట అనుకున్న కథ వేరు. అదే `మగధీర` కథ. ఈ కథతో సినిమా చేయాలని భావించారు. విజయేంద్రప్రసాద్ కథ అందించారు. కానీ కృష్ణతోపాటు వారి టీమ్‌కి ఈ కథ పెద్దగా నచ్చలేదట. ఇది వర్కౌట్ కాదని చెప్పి పక్కన పెట్టారట. వేరే కథతో `జగదేక వీరుడు` అనే మూవీని రూపొందించారు. కానీ అది బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. దీంతో ఈ కథని పక్కన పెట్టాడు విజయేంద్రప్రసాద్.
కానీ ఈ కథ గురించి తమ మధ్య చాలా సార్లు డిస్కషన్ జరిగిందట. రాజమౌళి కి తెలియడంతో ఇంత మంచి కథ ఎందుకు రిజెక్ట్ చేశారని రాజమౌళి ఆలోచించి కథలో మార్పులు చేశారట. దాన్ని మగధీరగా తయారు చేశారు. మొదట చిరంజీవితో అనుకున్నారట. మధ్యలో ఓ దర్శకుడు ఇన్‌వాల్వ్ అయి అది వద్దు అన్నారట. దీంతో మళ్లీ బ్యాక్ అయ్యారు. మళ్లీ రామ్ చరణ్ తో ఈ సినిమా చేశారు. ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అలా కృష్ణతో చేయాల్సిన మగధీర.. రామ్‌చరణ్‌కి వచ్చింది. ఆయన జీవితాన్నే మార్చేసింది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి రామ్ చరణ్ ని స్టార్‌ని చేసింది.
55
పెద్దితో దుమ్ములేపుతున్న చరణ్
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం `పెద్ది`లో నటించిన విషయం తెలిసిందే. బుచ్చిబాబుసానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 4న విడుదలైంది. ఇప్పటి వరకు మూడు వందల కోట్లు రాబట్టింది. ఇందులో చరణ్ క్రికెటర్‌గా, కుస్తీ వీరుడిగా, రన్నర్‌గా కనిపించారు. తమ ఊరు గుర్తింపు కోసం ఆయన చేసిన పోరాటమే ఈ మూవీ స్టోరీ. మిశ్రమ స్పందనతో డీసెంట్ కలెక్షన్లతో రన్ అవుతుంది. అయితే ఓవరాల్‌గా ఇది లాస్ ప్రాజెక్ట్ గానే ఉండబోతుందని టాక్.