గేమ్ ఛేంజర్ OTT రిలీజ్: ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

Published : Jan 24, 2025, 06:17 AM IST

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఓటిటి రిలీజ్ తేదీ అధికారికంగా ప్రకటించబడింది. ఫిబ్రవరి రెండో వారంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అయితే, హెచ్‌డి ప్రింట్ లీక్ అవ్వడం సినిమా వసూళ్లపై ప్రభావం చూపింది.

PREV
15
గేమ్ ఛేంజర్ OTT రిలీజ్: ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
Game Changer, Ramcharan, OTT Release Date


 ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా చేసిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’.సంక్రాంతి కానుకగా రూపొంది  పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలిరోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయినా కలెక్షన్స్ లో మాత్రం తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోయినట్లు మొదట్లో ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని తేలింది. సినిమాకు ఫ్లాఫ్ టాక్ రావటంతో చాలా మంది ఓటిటి లో వచ్చాక చూద్దాములే అని ఆగిపోయారు. ఈ క్రమంలో ఓటిటి రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది. 
 

25


గేమ్ ఛేంజర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. రిలీజ్‍కు ముందే ఈ ఓటీటీ డీల్ పూర్తైంది. దాంతో మంచి రేటుకే సినిమా ఓటిటికి  వెళ్లింది. ఇక  గేమ్ ఛేంజర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫిబ్రవరి రెండో వారంలో వస్తుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 14 లేదా 15న గేమ్ ఛేంజర్ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు ప్రైమ్ వీడియో ప్లాన్ చేసుకుందనే వార్తలు మీడియాలో  చక్కర్లు కొడుతున్నాయి.
 

35


అయితే గేమ్ ఛేంజర్ సినిమా హెచ్‍డీ ప్రింట్ అప్పటికే ఆన్‍‍లైన్‍లో లీక్ అవ్వటం ఓటిటికు పెద్ద దెబ్బే.  ఈ విషయంలో సైబర్ క్రైమ్‍కు మూవీ టీమ్ ఫిర్యాదు కూడా చేసింది. దీని వెనుక ఓ ముఠా ఉందని, లీక్ గురించి రిలీజ్‍కు ముందే బెదిరింపులు వచ్చాయని కంప్లైట్ చేసింది. రిలీజైన వారంలోనే ఆన్‍లైన్‍లో హెచ్‍డీ ప్రింట్ లీక్ అవడం కూడా గేమ్ ఛేంజర్ మూవీకి కలెక్షన్స్ కు ఎదురుదెబ్బగా మారింది.
 

45


గేమ్ ఛేంజర్ సినిమాను సుమారు రూ.400కోట్ల బడ్జెట్‍తో దిల్‍రాజు, శిరీష్ నిర్మించినట్టు అంచనా. గేమ్ ఛేంజర్  బాక్సఫీస్ వద్ద అనుకున్న కలెక్షన్లు రాబట్టలేక పోయింది. ఈ సినిమా రూ.220 కోట్లకు ప్రీరిలీజ్ చేసింది. అయితే,బ్రేక్ ఈవెను కోసం మరో రూ.222 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఈ 11 రోజులు వ్యవధిలో రూ.127.15 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే మరో రూ.130 కోట్లకి పైగా షేర్ ను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.

55

 
సినిమా ఎలా ఉన్నా  అప్పన్న పాత్రలో రామ్‌ చరణ్‌ (Ram Charan) నటనపై  అంతటా ప్రశంసలు వచ్చాయి.   శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో దిల్‌ రాజు ‘గేమ్‌ ఛేంజర్‌’ను నిర్మించారు. అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు.  గేమ్ ఛేంజర్ చిత్రానికి తొలి రోజు రూ.186కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మూవీ టీమ్ వెల్లడించడం రచ్చ అయింది. లెక్కలు పెంచేసి చూపిస్తున్నారని నెటిజన్ల నుంచి భారీగా ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో రచ్చ అయింది. ఆ తర్వాత వసూళ్లలో డీలా పడింది ఈ చిత్రం. 

click me!

Recommended Stories