97వ ఆస్కార్ అవార్డుల నామినేషన్ల జాబితా విడుదలైంది. ‘ది బ్రూటలిస్ట్’, ‘ఎమిలియా పెరెజ్’ చిత్రాలు అత్యధిక కేటగిరిల్లో నామినేట్ అయ్యాయి. ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ‘అనోజా’ కూడా నామినేషన్ పొందింది.
Oscars 2025, Nominations Full List, 97th Academy Awards
వరల్డ్ వైడ్ గా సిని లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆస్కార్స్ 2025’నామినేష్స్ లిస్ట్ బయిటకు వచ్చింది. ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల లిస్ట్ ను అకాడమీ ప్రకటించింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ (Los Angeles)లో దావానంలా వ్యాపించిన కార్చిచ్చు కారణంగా నామినేషన్ల (Oscar Nominations) కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు గురువారం 97వ అకాడమీ అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల లిస్ట్ ను విడుదల చేసింది.
ఈ లిస్ట్ లో ... గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటిన ‘ది బ్రూటలిస్ట్’, ‘ఎమిలియా పెరెజ్’ చిత్రాలు అత్యధిక కేటగిరిల్లో నామినేషన్స్ సొంతం చేసుకోవటం గమనించవచ్చు. అలాగే ఆ తర్వాతి స్థానాల్లో కాన్‌క్లేవ్, అనోరా, ది సబ్‌స్టాన్స్, ది రియల్ పెయిన్, విక్డ్, ఎ కంప్లీట్ అన్‌నోన్, డ్యూన్: పార్ట్2 చిత్రాలున్నాయి.
26
India's Official Oscars 2025 Entry
ఇక ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ‘అనోజా’ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (లైవ్ యాక్షన్) కేటగిరిలో నామినేషన్ సొంతం చేసుకుంది. ఆడమ్ జె.గ్రేవ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రియాంక చోప్రా జోన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 2న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కోనన్ ఓబ్రియాన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
36
ఉత్తమ చిత్రం
అనోరా
ది బ్రూటలిస్ట్
ఎ కంప్లీట్ అన్‌నోన్
కాన్‌క్లేవ్
డ్యూన్: పార్ట్2
ఎమిలియా పెరెజ్
ఐయామ్ స్టిల్ హియర్
నికెల్ బాయ్స్
ది సబ్‌స్టాన్స్
విక్డ్