రాంచరణ్ కవలపిల్లలకు తండ్రి అయ్యాక తొలిసారి స్పందించారు. ఉపాసన ట్విన్స్ కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరోసారి తండ్రి అయ్యారు. ఉపాసన జనవరి 31 రాత్రి కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ శుభవార్తని చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. ఉపాసన, ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారు అని చిరంజీవి ప్రకటించారు. చిరంజీవి తర్వాత అభిమానులంతా రాంచరణ్ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.
25
కవల పిల్లలపై రాంచరణ్ ఫస్ట్ రియాక్షన్
తాజాగా రాంచరణ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకు కవల పిల్లలు జన్మించిన తర్వాత రాంచరణ్ ఫస్ట్ రియాక్షన్ ఇది. మాకు కవల పిల్లలు జన్మించిన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. దీనిని బ్లెస్సింగ్ గా భావిస్తున్నాం. మన జీవితాల్లో మహిళలే ప్రధాన శక్తిగా నిలుస్తారు.
35
అభిమానులకు కృతజ్ఞతలు
ఎప్పుడూ మా వైపున నిలబడే ఫ్యామిలీకి, శ్రేయోభిలాషులకు, అభిమానులకు కృతజ్ఞతలు చెబుతున్నా అంటూ రాంచరణ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ని చేసే క్రమంలో రాంచరణ్ ఉపాసన బేబీ బంప్ తో ఉన్న పిక్ షేర్ చేశారు. ఇందులో రెండు డాగ్స్ వీరికి ఇరువైపుల ఉన్నాయి.
అదే సమయంలో రాంచరణ్ టీమ్ నుంచి వార్నింగ్ లాంటి ప్రకటన వెలువడింది. ప్రైవసీ కారణాల దృష్ట్యా రాంచరణ్, ఉపాసన పిల్లలకు సంబంధించిన దృశ్యాలు ఎవరూ ప్రసారం చేయడం కానీ, వైరల్ చేయడం కానీ చేయద్దు అని తెలిపారు. అలా చేస్తే ప్రైవసీ వయలేషన్ కింద కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
55
క్లీంకారని తీసుకుని వెళుతుండగా ఘటన
ఈ ప్రకటన వెలువడడం వెనుక కారణం ఉంది. రాంచరణ్ అపోలో ఆసుపత్రికి వెళుతుండగా మెగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రాంచరణ్ తన కుమార్తె క్లీంకారని ఎత్తుకుని వెళుతుండగా అభిమానులు ఒక్కసారిగా ఎగసి పడ్డారు. ఆ జనంలో రాంచరణ్ తన కుమార్తెని తీసుకుని వెళ్లడం చాలా కష్టం అయింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని దృశ్యాల్లో క్లీంకార ముఖం కనిపిస్తోంది. ఇప్పటి వరకు రాంచరణ్ తన కుమార్తె ముఖాన్ని అధికారికంగా చూపించలేదు. అభిమానుల అత్యుత్సాహం వల్ల ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. వాటిని ఎవరూ ప్రసారం చేయొద్దని, వైరల్ చేయొద్దని రాంచరణ్ టీం వార్నింగ్ ఇచ్చింది. ఇది పక్కన పెడితే.. 2 ఏళ్ళ వయసున్న పసిపాపని ఎత్తుకుని రాంచరణ్ వెళుతున్నప్పుడు అభిమానులు సంయమనం పాటించాలి. అలా రాంచరణ్ మీద పడడానికి ప్రయత్నిస్తే.. పొరపాటున పాపకి ఏమైనా అయితే పరిస్థితి ఏంటి అని నెటిజన్లు మెగా అభిమానులని దుమ్మెత్తి పోస్తున్నారు.