పుష్ప నిర్మాతలపై ఐటీ రైడ్స్.. అల్లు అర్జున్ మూవీకి వచ్చినవన్నీ ఫేక్ కలెక్షన్స్ ఆ..? నిజమెంత...?

Published : Jan 21, 2025, 03:12 PM ISTUpdated : Jan 21, 2025, 03:41 PM IST

పుష్ప నిర్మాతలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మొదటి నుంచి రిలీజ్, కలెక్షన్ల కాంట్రవర్సీలో కొట్టుమిట్టాడుతున్న ఈసినిమాకు ఇప్పుడు ఐటి రైడ్స్ గండం పట్టుకుంది. ఇంతకీ విషయం ఏంటంటే..?   

PREV
15
పుష్ప నిర్మాతలపై ఐటీ రైడ్స్.. అల్లు అర్జున్ మూవీకి వచ్చినవన్నీ  ఫేక్ కలెక్షన్స్ ఆ..? నిజమెంత...?

పుష్ప సినిమా నిర్మాతలకు షాక్ తగిలింది. ఈరోజు( 21-01-2025)  మంగళవారం  ఉదయం తెల్లవారుజామునుంచి  ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు తో పాటు పుష్ప సినిమా నిర్మాతలైన మైత్రీమూవీ మకర్స్ పై  కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన ఘటన తెలుగు సినీ ఇండస్ట్రీ లో సంచలనం గా మారింది.  ఉన్నట్టుండి ఈ ఐటీ రైడ్స్ ఏంటి అని అంతా షాక్ అవుతున్నారు. టాలీవుడ్ ఈ పరిణామంతో ఉలిక్కి పడింది. 

25

దిల్ రాజుతో పాటు గా పుష్ప 2 నిర్మాతలు నవీన్ ఎర్నేని & సీఈఓ చెర్రీ లపై కూడా ఐటీ దాడులు నిర్వహించారు. పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1850 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని ఈసినిమా నిర్మాతలు స్వయంగా ప్రకటించారు. దాంతో ఈ రైట్స్ లో ఆ సినిమాకు సబంధించిన పత్రాలు, కలెక్షన్స్ కు సబంధించిన అఫిషియల్ వివరాలను వారుఅడిగినట్టు తెలుస్తోంది. పుష్ప2నిర్మాతతో పాటు   యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర’ సినిమాకి ఫైనాన్స్ అందించిన రంగయ్య, అభిషేక్ అగర్వాల్ పై ఐటీ అధికారులు రైట్స్ చేసినట్టు తెలుస్తోంది. 

35

ఈక్రమంలో పుష్ప కలెక్షన్ల విషయంలో ఎంత వరకూ నిజం ఉది. అవి ఫేక్ కలెక్షన్స్ అయ్యి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఇలా లేదు కాని.. ఈమధ్య కాలం లో నిర్మాతలు తమ సినిమాలకు సబంధించిన  కలెక్షన్స్ ని అభిమానుల కోసం బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.  ః తమ సినిమాలకు వందల కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని పోస్టర్స్ ద్వారా  పబ్లిసిటీ చేస్తున్నారు. వచ్చిన కలెక్షన్స్ ని వేసుకుంటే పర్వాలేదు, కానీ వచ్చిన దానికంటే అదనంగా కొంత యాడ్ చేసి మరీ..  వసూళ్లను వేసుకొని ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 
 

45

ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తేగేమ్ చేంజర్’ సినిమా ఫస్ట్ షో నుంచే  డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కాని ఈ సినిమాకి మొదటి రోజు నిర్మాతలు వేసిన పోస్టర్ ని చూసి అందరు షాక్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 186 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్పుకొచ్చారు. సినిమాకి అంత పెద్ద డిజాస్టర్ టాక్ వచ్చింది, ఆ టాక్ మీద ఇంత వసూళ్లు ఎలా సాధ్యం అంటూ దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. దిల్ రాజు పై ఐటీ అధికారులు రైడింగ్స్ చేయడానికి ఈ పోస్టర్ కూడా ఒక కారణం అని అంటున్నారు. 
 

55

అదే విధంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి వారం రోజుల ముందే 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని కూడా పోస్టర్స్ ద్వారా ప్రకటించారు. అదే విధంగా పుష్ప 2 చిత్రం దేశం లోనే ఇండస్ట్రీ హిట్ అని, 1860 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని పోస్టర్లు విడుదల చేశారు. అందుకే వాళ్లపై కూడా రైడింగ్ జరిగింది. ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందంతా ఎందుకు జరుగుతందో అర్ధం కాకుండా ఉన్నారు జనాలు. 
 

Read more Photos on
click me!

Recommended Stories