ఇక తన సినిమాలకు, నటనకు నాన్నగారు, బాబాయ్ నాగబాబు గారు పెద్ద క్రిటిక్స్ అని రాంచరణ్ తెలిపాడు. చిరుత ఫస్ట్ ప్రీమియర్ షో ప్రసాద్ ల్యాబ్స్ లో వేసారు. మా ఫ్యామిలీ మొత్తం చూసింది. నాగబాబు బాబాయ్ అయితే నేను ఎలా చేశానో అని టెన్షన్ పడుతూ సినిమా చూశారు. ఆయనకు చెమటలు పట్టేశాయి. సినిమా అయిపోయాక సంతోషంతో చాలా బాగా చేసావురా అని అభినందించారు.