నాలుగేండ్లకి ప్రతిఫలమిదేనా? రాజమౌళిపై ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అసంతృప్తి.. షాకిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` నిజాలు ?

Published : Mar 27, 2022, 09:49 AM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది. ఫస్ట్ డే రోజు ఇండియన్‌ సినిమా రికార్డ్ లను తిరగరాసింది. సంచలనాల దిశగా దూసుకుపోతుంది. అదే సమయంలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని షాకింగ్‌ విషయాలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. 

PREV
18
నాలుగేండ్లకి ప్రతిఫలమిదేనా? రాజమౌళిపై ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అసంతృప్తి.. షాకిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` నిజాలు ?
rrr movie

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మల్టీస్టారర్‌ చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నాలుగు సార్లు వాయిదా అనంతరం ఎట్టకేలకు శుక్రవారం(మార్చి 25) ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదివేల థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డ్ స్థాయిలో బిజినెస్‌ జరిగింది. ఇక ఫస్ట్ డే రోజు ఏకంగా రూ.223కోట్లు వసూలు చేసి `బాహుబలి 2` ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డ్ ని బ్రేక్‌ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. 

28
rrr movie

మున్ముందు ఈ సినిమా మరిన్ని రికార్డు లు సృష్టించబోతుందనే టాక్‌ వినిపిస్తుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అభిమానులు ఈ సినిమాపై అభిమానాన్ని చూపిస్తున్నారు. ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరోవైపు చిత్ర పరిశ్రమ నుంచి విశేష ప్రశంసలు దక్కుతున్నాయి. మాస్టర్ పీస్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు. రాజమౌళికి అపజయమనేది లేదని అంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపే. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని షాకింగ్‌ నిజాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. 

38
rrr movie

ఇప్పటికే ఈ సినిమాకి డివైడ్‌ టాక్‌ వస్తుంది. సినిమా స్లోగా ఉందని, ఎమోషనల్‌ కనెక్టివిటీ లోపించిందని, ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గిందనే విమర్శలు వచ్చాయి. కొన్ని సీన్లు హైలైట్‌గా ఉన్నాయి తప్పితే ఓవరాల్‌గా సినిమాలో అంత స్టఫ్‌ లేదని, చాలా లాజిక్‌ లెస్‌గా ఉందనే విమర్శలు వస్తున్నాయి. పైగా పది రోజులపాటు భారీగా పెరిగిన టికెట్‌ ధరలు ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియెన్స్ ని దూరం చేస్తుంది. వీకెండ్‌ మూడు రోజులు తప్పితే సోమవారం నుంచి `భీమ్లా నాయక్‌` తరహాలోనే  కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోబోతున్నాయని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నారు. దీంతో `ఆర్‌ఆర్‌ఆర్‌` కనీసం రూ.600కోట్ల రీచ్‌ ఉండదని అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే ఇదొక రెగ్యూలర్‌ సినిమాగానే మిగిలిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

48
rrr movie

అయితే ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అసంతృప్తితో ఉన్నారనేది సోషల్‌ మీడియా టాక్‌. విడుదలయ్యాక ఎన్టీఆర్‌, చరణ్‌ ట్వీట్లు పెట్టారు. అవి ఏదో మొక్కుబడిగా పెట్టినట్టుంది గానీ, రాజమౌళిపై ప్రశంసలు కురిపించడంగానీ, సినిమా ఆహో, ఓహో అని చెప్పడంగానీ లేదు. జస్ట్ ఆదరిస్తున్న ఆడియెన్స్ కి ధన్యవాదాలు తెలిపారు ఎన్టీఆర్‌. చరణ్ సైతం రాజమౌళి సినిమా అంటూ వారి అసంతృప్తిని పరోక్షంగా వెల్లడించినట్టుగా ఉందని క్రిటిక్స్ నుంచి వినిపిస్తున్న టాక్‌. 
 

58
rrr movie

`ఆర్‌ఆర్‌ఆర్‌`లో తన పాత్ర విషయంలో రామ్‌చరణ్‌ కాస్త సంతృప్తిగానే ఉన్నా, ఎన్టీఆర్‌ మాత్రం తీవ్ర స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారని భోగట్టా. ఆయన పాత్రని తగ్గించారని, చరణ్‌ రోల్‌తో కంపేర్‌ చేస్తే ఎన్టీఆర్‌ రోల్‌ ఊహించిన స్థాయిలో లేదనే అసంతృప్తి ఆయన అభిమానుల నుంచి కూడా వినిపిస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళి ఫస్ట్ టైమ్‌ కన్‌ఫ్యూజ్‌ అయ్యారట. ఏదో చెప్పి, ఏదో చేశారని అంటున్నారు. సినిమా చూసుకుని అసంతృప్తికి లోనవ్వడమే కాదు, చాలా వరకు సీన్స్, యాక్షన్‌ సీక్వెన్స్ ఆర్డర్‌ కూడా మార్చరనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని సీక్వెన్స్ రీషూట్‌ టైమ్‌లోనే తారక్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారని ఫిల్మ్ నగర్‌ టాక్‌.

68
rrr movie

ఇదిలా ఉంటే `బాహుబలి 2` సినిమాతో ప్రభాస్‌కి పాన్‌ ఇండియా స్టార్‌ ఇమేజ్‌ వచ్చింది. వరల్డ్ వైడ్‌గా గుర్తింపు దక్కింది. కానీ ఆ స్థాయి గుర్తింపు `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాతో ఎన్టీఆర్‌కి రావడం లేదనే టాక్‌ వినిపిస్తుంది. చరణ్‌ ఈ విషయంలో చాలా బెటర్‌గా ఉన్నారని ఆయనకు మంచి ఇమేజ్‌ వస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్‌ ప్రకారం కూడా చరణ్‌కే ఎక్కువ మార్కుటు పడుతుండగా, ఎన్టీఆర్‌ విషయంలో అలా జరగడం లేదు.

78
rrr movie

ఇదిలా ఉంటే `ఆర్‌ఆర్‌ఆర్‌`కిగానూ ఎన్టీఆర్‌, చరణ్‌లకు ఇచ్చిన పారితోషికం రూ.35కోట్లు అని టాక్‌. దీంతోపాటు కలెక్షన్లలో కొంత షేర్‌ ఇవ్వబోతున్నారట. మొత్తంగా వీరికి చెరో రూ.50కోట్లు పారితోషికంగా దక్కబోతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం వీరిద్దరు నాలుగేండ్లు కష్టపడ్డారు. ఈ నాలుగేండ్లలో నాలుగు సినిమాలు చేసుకునే వారు. ఒక్కో సినిమాకి రూ.25కోట్లు పారితోషికం తీసుకున్నా, వంద కోట్లు సంపాదించేవారు. ఈ విషయంలోనూ వీరిద్దరు అసంతృప్తిగా ఉన్నారని టాక్‌. మరి ఇందులో నిజమెంతో గానీ ఇప్పుడీ నిజాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. షాకిస్తున్నాయి. అయితే సినిమాకి వస్తోన్న బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో ఇవన్నీ పక్కకు వెళ్లిపోతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
 

88
rrr movie

 నేడు రామ్‌చరణ్‌ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తనకు బర్త్ డే సందర్భంగా మంచి గిఫ్ట్ ఇచ్చారని ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేయడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories