ఆదిపురుష్ పోస్టర్, మళ్ళీ నిరాశే.. ఇక మారవా అంటూ డైరెక్టర్ పై ట్రోలింగ్, ట్రెండింగ్ లో రాంచరణ్

Published : Mar 31, 2023, 02:00 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామాయణ గాధతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు అభిమానుల్లో ఉండేవి. కానీ టీజర్ విడుదలయ్యాక అంచనాలన్నీ తలక్రిందులు అయ్యాయి.

PREV
16
ఆదిపురుష్ పోస్టర్, మళ్ళీ నిరాశే.. ఇక మారవా అంటూ డైరెక్టర్ పై ట్రోలింగ్, ట్రెండింగ్ లో రాంచరణ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామాయణ గాధతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు అభిమానుల్లో ఉండేవి. కానీ టీజర్ విడుదలయ్యాక అంచనాలన్నీ తలక్రిందులు అయ్యాయి. దర్శకుడు ఓం రౌత్ ఏదో చేయబోయే ఇంకేదో చేసినట్లు ఉన్నాడు. గ్రాఫిక్స్ మాయలో పడి రామాయణాన్ని, ఆ పాత్రలని కించపరిచారు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 

26

ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావలసిన ఈ చిత్రం నెగిటివ్ ఇంపాక్ట్ కారణంగా జూన్ కి వాయిదా పడింది. అప్పుడు కూడా వస్తుందో రాదో క్లారిటీ లేదు. శ్రీరామనవమి సందర్భంగా గురువారం చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేశారు. టీజర్ కి ఎలాంటి విమర్శలు ఎదురయ్యాయో పోస్టర్ ని కూడా నెటిజన్లు అదే విధంగా ట్రోల్ చేస్తున్నారు. 

36

సీతారాములుగా ప్రభాస్, కృతి సనన్ పోస్టర్ లో కనిపిస్తున్నారు. అలాగే హనుమంతుడు, లక్ష్మణుడు కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్ రాముడి లుక్ ఏమాత్రం స్ట్రైకింగ్ గా లేదు. కాస్ట్యూమ్స్ దారుణంగా ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. 

46

ఫలితంగా దర్శకుడు ఓం రౌత్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామాయణం, రాముడు, సీత అంటే ప్రేక్షకుల్లో ఒక ఇమేజ్, అంచనాలు ఉంటాయి. వాటికి భిన్నంగా పురాణాలతో ప్రయోగాలు చేస్తానంటే కుదరదు అని నెటిజన్లు ఓం రౌత్ పై చివాట్లు కురిపిస్తున్నారు. 

 

56

మరికొందరు ఫ్యాన్స్ ఓం రౌత్ నీవు ఇక మారవా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ విమర్శలకు కారణం అయిన టీజర్ లో కూడా ఎక్కడా ఇది రామాయణం అనే భావన మచ్చుక కూడా కనిపించదు. ఇక సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్న రావణుడి పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రావణుడి లుక్ ఎవరో మాయలఫకీరుని చూసినట్లు ఉందని, టెర్రరిస్ట్ లుక్ ల ఉందని విమర్శించారు. 

66

ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ట్రెండింగ్ గా మారారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ పోషించింది రాముడి పాత్ర కాదు.. రామరాజు పాత్ర. కానీ ఆడియన్స్ రాంచరణ్ శ్రీరాముడు అనేంతగా ఆ పాత్రని ఓన్ చేసుకున్నారు. ఆ విషయంలో రాజమౌళికి క్రెడిట్ ఇవ్వాలి. ఆదిపురుష్ పై నెగిటివ్ ట్రెండ్ జరుగుతున్న వేళ రాంచరణ్ రామరాజు లుక్ వైరల్ అవుతోంది. రాంచరణ్ ఇలాంటి ఇతిహాసాల్లో నటిస్తే బావుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. రాముడిగా పర్ఫెక్ట్ గా ఉంటాడని అంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories