రామ్ చరణ్ , ఉపాసన తమ కవల పిల్లలకు పెట్టిన పేర్లు ఏంటో తెలుసా? నిజం ఎంత?

Published : Feb 13, 2026, 10:31 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టడంతో.. మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. ఈక్రమంలో రామ్ చరణ్ తన కవల పిల్లలకు పెట్టిన పేర్లు ఇవే అంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. 

PREV
16
మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం..

మెగా పవర్ స్టార్.. గ్లోబల్ హీరో, రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు కవల పిల్లలకు తల్లీ తండ్రులు కావడంతో మెగా ఫ్యామిలీలో సంతోషకర వాతావరణం నెలకొంది. ఇక అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. జనవరి 31 ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చారు. 

వారిలో ఒకరు మగపిల్లాడు కాగా.. మరొక ఆడబిడ్డ పుట్టింది. మెగా ఫ్యామిలీలోకి మొదటి వారసుడు రావడంతో .. కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. అభిమానుల్లో కూడా ఆనందం రెట్టింపు అయింది. అయితే రామ్ చరణ్ తన కవల పిల్లకు పెట్టిన పేర్లపై సోషల్ మీడియా కోడై కూస్తోంది.

26
రామ్ చరణ్ పిల్లల పేర్లు ఇవేనా?

రామ్ చరణ్ ముగ్గరు బిడ్డలకుతండ్రి అయ్యాడు.. ఈ సంతోషకరమైన విషయంతో పాటు.. ప్రస్తుతం మరో ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదే రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కవల పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టారనేది ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 11న మెగా కిడ్స్ బారసాల కార్యక్రమం ఘనంగా జరిగిందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 

ఈ కార్యక్రమానికి ఫ్యామిలీలో అత్యంత సన్నిహితులు మాత్రమే వచ్చారట. ఇక ఆ ఇద్దరు చిన్నారులకి పేర్లు కూడా పెట్టినట్టు సమాచారం. వారిలో అబ్బాయి పేరు శివరామ్‌ అని, అమ్మాయి పేరు అన్విరా దేవి అని తెలుస్తోంది. అయితే ఈ పేర్లను మెగా ఫ్యామిలీ ఎక్కడా అఫీషియల్ గా వెల్లడించలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ పేర్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

36
మెగా ఫ్యామిలీలో పేర్ల సెంటిమెంట్..

ఇప్పటి వరకు చూసుకుంటే.. మెగా ఫ్యామిలీలో పుట్టిన చాలా మంది పిల్లలకు ఆంజనేయ స్వామి లేదా శ్రీరాముడి పేరు కలిసివచ్చేలా నామకరణం చేస్తుంటారు.కాని మొదటి సారి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి.. రామ్ చరణ్ తన కూతురికి క్లింకారా అనే పేరు పెట్టారు.

ఈ పేరును లలిత సహస్రనామం నుండి తీసుకున్నట్టు అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం కవల పిల్లకు పెట్టిన పేర్లు నిజమే అయితే..మెగా ఫ్యామిలీ సెంటిమెంట్ ను ఫాలో అవుతుందనే చెప్పాలి.

46
మెగా కవలల జాతకం

రామ్ చరణ్ ‌- ఉపాసన కవల పిల్లలు జనవరి 31వ న శనివారం జన్మించారు. పునర్వసు నక్షత్రంలో వీరు పుట్టడం అత్యంత శుభప్రదం. ఎందుకుంటే ఈ నక్షత్రం శ్రీరాముడు జన్మనక్షత్రం. అందుకే బాబుకు శివరామ్ అని పేరు పెట్టినట్టు వైరల్ అవుతోంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. చాలా దర్శబద్ధంగా ఉంటారు. జోతిష్య నిపుణుల ప్రకారం.. ఈ నక్షత్ర జాతకులు ఏదైనా పనిని మధ్యలో వదలకుండా పూర్తి చేస్తారు. ‘ పునర్వసు’ అంటే మళ్లీ ప్రకాశించడం అని అర్థం. ఇది వంశాభివృద్ధికి సంకేతం.

56
మెగా కవలల జాతకం

రామ్ చరణ్ ‌- ఉపాసన కవల పిల్లలు జనవరి 31వ న శనివారం జన్మించారు. పునర్వసు నక్షత్రంలో వీరు పుట్టడం అత్యంత శుభప్రదం. ఎందుకుంటే ఈ నక్షత్రం శ్రీరాముడు జన్మనక్షత్రం. అందుకే బాబుకు శివరామ్ అని పేరు పెట్టినట్టు వైరల్ అవుతోంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. అందరికి ఆదర్శంగా ఉంటారు. జోతిష్య నిపుణుల ప్రకారం.. ఈ నక్షత్ర జాతకులు ఏదైనా పనిని మధ్యలో వదలకుండా పూర్తి చేస్తారు. ‘ పునర్వసు’ అంటే మళ్లీ ప్రకాశించడం అని అర్థం. ఇది వంశాభివృద్ధికి సంకేతం.

66
ఈసారైనా చూపిస్తారా..?

మెగా అభిమానుల్లో మరో లోటు ఉండిపోయింది. అదేంటంటే.. రామ్ చరణ్ కూతురు క్లింకారాను ఇంత వరకూ ఎవరికీ వారు చూపించలేదు. ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అభిమానులు ఎప్పటి నుంచో ఈవిషయంలో అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడు చూపిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. 

ఇక తాజాగా చరణ్ కవల పిల్లలను కనడం.. అందులో మెగా వారసుడు కూడా ఉండటంతో... అభిమానులకు ఆ పిల్లలను చూపిస్తారా..? లేక గతంలో మాదిరిగానే దాచేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి చరణ్ తన వారసుడిని ఎప్పుడు పరిచయం చేస్తాడో?

Read more Photos on
click me!

Recommended Stories