మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన కొణిదెల మళ్ళీ తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. చిరంజీవి కోరిక నెరవేరడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు షురూ అయ్యాయి.
ఈసారి డబుల్ ధమాకా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. పెద్ది రిలీజ్ కంటే ముందుగానే మెగా ఫ్యామిలిలో సంబరాలు మొదలయ్యాయి. కొన్ని నెలల క్రితమే రాంచరణ్, ఉపాసన దంపతులకు ట్విన్స్ పుట్టబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఆల్రెడీ ఉపాసన, రాంచరణ్ లకు క్లీంకార కొణిదెల కుమార్తె ఉంది. తాజాగా రాంచరణ్, ఉపాసన దంపతులు రెండవసారి తల్లిదండ్రులు అయ్యారు. అది కూడా కవల పిల్లలకు.
25
కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన
ఈసారి కొణిదెల ఫ్యామిలీలోకి బుల్లి వారసుడు వచ్చారు. అలాగే మరో వారసురాలు కూడా. ఉపాసన పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టారు. దీనితో మెగా ఫ్యామిలీలో సంతోషాలు వెల్లివిరిశాయి. మెగా అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. ఉపాసన డెలివరీ డేట్ జనవరి 31న అని ముందుగానే వార్తలు వైరల్ అయ్యాయి. దీనితో మెగా అభిమానులు వారసులు రాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలుపెట్టారు.
35
సంతోషంగా ప్రకటించిన చిరు
ఈ శుభవార్తని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ప్రకటించారు. రాంచరణ్, ఉపాసనలకు కవల పిల్లలు ఒక పాప, ఒక బాబు పుట్టారు. ఈ వార్తని ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఇద్దరు పిల్లలు, తల్లి క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి సంతోషకర క్షణం రావడానికి కారణం భగవంతుని ఆశీస్సులే. మీ అందరి ప్రేమ అభిమానులకు కృతజ్ఞతలు అని చిరంజీవి ట్వీట్ చేశారు.
రాంచరణ్, ఉపాసన లకు పెళ్ళైన పదేళ్ల తర్వాత తొలి సంతానం కలిగింది. 2023లో క్లీంకార కొణిదెల జన్మించింది. క్లీంకార కొణిదెల పుట్టిన తర్వాత రెండేళ్లకే చరణ్, ఉపాసన సెకండ్ ప్రెగ్నన్సీ ప్లాన్ చేసుకుని కవల పిల్లలని పొందారు.
55
నెరవేరిన చిరంజీవి కోరిక
క్లీంకార కొణిదెల పుట్టినప్పుడు చిరంజీవి, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. అయితే తన ఇల్లు లేడీస్ హాస్టల్ లా మారింది అని.. ఒక అబ్బాయిని కనమని రాంచరణ్ ని తాను అడిగినట్లు చిరంజీవి గతంలో కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అబ్బాయితో పాటు అమ్మాయి కూడా జన్మించడంతో చిరంజీవి డబుల్ హ్యాపీ.