Jabardasth : చలాకి చంటి ని మోసం చేసింది ఎవరు, నాశనమైపోతారని.. జబర్దస్త్ స్టార్ కమెడియన్ శాపనార్ధాలు..

Published : Jan 31, 2026, 07:16 PM IST

జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు సాధించిన చలాకి చంటి.. చాలా కాలంగా యాక్టీవ్ గా కనిపించడంలేదు. వరుస సినిమాలు చేసిన చంటీ మళ్లీ జబర్దస్త్ స్టేజ్ మీదకు రావాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో చంటిని మోసం చేసింది ఎవరు?

PREV
15
స్టార్ కమెడియన్ గా ఎదిగిన చంటి..

జబర్దస్త్ కామెడీ షో చాలామందికి లైఫ్ ఇచ్చింది. తింటానికి తిండి కూడా లేకుండా ఇబ్బందిపడ్డ వారిని స్టార్ సెలబ్రిటీలను చేసింది. వారిలో టాలెంట్ కు మంచి ఫ్టాట్ ఫామ్ గా నిలిచింది. జబర్దస్త్ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఎంతో మంది కమెడియన్స్‌లో చలాకి చంటి కూడా ఒకరు. బుల్లితెరపై ఎన్నో టెలివిజన్ షోలు చేసిన చంటీ.. ఆతరువాత సినిమాల్లో కూడా వరుస అవకాశాలు సాధించాడు.

 కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న చంటీ.. ఇటీవలి కాలంలో పెద్దగా కనిపించకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జబర్దస్త్ షోలో తన కామెడీ టైమింగ్, స్టేజ్ ప్రెజెన్స్‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్న చలాకి చంటి జబర్దస్త్ నుంచి వెండితెరకు వెళ్లిన తొలి కమెడియన్‌గాగా కూడా గుర్తింపు సాధించాడు.

25
జబర్దస్త్ వదిలి సినిమాల్లోకి..

ఒక దశలో జబర్దస్త్ సీనియర్లు అందరు సినిమాల్లో బిజీ అవ్వడంతో.. చంటి కూడా అదే దారిలో నడిచారు. సినిమా అవకాశాల వల్ల జబర్దస్త్ షోను వదిలి వరుస సినిమాలు చేశాడు. ఆ స్టార్ డమ్ తో తర్వాత కాలంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కూడా కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు చంటి. ఆ దశలో చలాకి చంటి కెరీర్ పీక్ స్టేజ్‌లో నడిచింది. కానీ కారణం ఏంటో తెలియదు కానీ.. జబర్ధస్త్ నుంచి వచ్చిన తరువాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తన కెరీర్ అనూహ్యంగా డౌన్ అయ్యిందని తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

35
కష్టాల్లో ఉంటే ముఖం కూడా చూడటంలేదు..

ఆ ఇంటర్వ్యూలో చలాకి చంటి మాట్లాడుతూ, “ఈ కాలంలో డబ్బులు ఉంటేనే మనిషికి విలువ. డబ్బులు ఉన్నప్పుడు నా చుట్టూ అందరూ ఉండేవారు. కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో బాగా పరిచయం ఉన్న ఎంతో మంది నా వైపు చూడడం కూడా మానేశారు. ఎదురుపడితే కనీసం పలకరించేవాళ్లు కూడా కాదు. నాపై కొంతమంది దుష్ప్రచారాలు చేయడం వల్ల సినిమాల్లో అవకాశాలు కోల్పోయాను. నాకు ఈగో ఎక్కువ అని, షూటింగ్స్‌కు ఎక్కువ డబ్బులు అడుగుతానని, ఇంకేదో అడుగుతానని.. సంబంధం లేని వివాదాల్లో నన్ను ఇరికించి అవకాశాలు రాకుండా చేశారని'' చలాకి చంటి చెప్పారు.

45
వాళ్లు నాశనం అయిపోతారు..

చంటి మాట్లాడుతూ.. “ ఇన్ను ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చూసినవాళ్లు, నాకు అవకాశాలు రాకూడదని నెగెటీవ్ ప్రచారం చేసినవాళ్ళకు నా ఆవేదన కర్మ రూపంలో గట్టిగానే తగులుతుంది. నా వస్త్రం మీద ఒట్టేసి చెపుతున్నా.. వస్త్రం అని ఎందుకు అన్నానో చాలామందికి తెలుసు.. మళ్లీ చెపుతున్నా.. నా వస్త్రం మీద ఒట్టేసి చెపుతున్న వాళ్ల నాశనం చూసిన తర్వాతే నేను చస్తాను” అంటూ చలాకి చంటి తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు.

55
జబర్దస్త్ షో తప్ప మరో ప్రాజెక్ట్ లేదు..

ప్రస్తుతం చలాకి చంటి చేతిలో జబర్దస్త్ షో తప్ప మరో ప్రాజెక్ట్ లేదని తెలుస్తోంది. ఒకప్పుడు ఈటీవీలో ప్రసారం అయిన దాదాపు ప్రతి ఎంటర్‌టైన్‌మెంట్ షోలో కనిపించిన ఆయన, ‘నా షో.. నా ఇష్టం’ వంటి కార్యక్రమాలకు యాంకర్‌గా కూడా వ్యవహరించారు. అలాగే ఈటీవీ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’కు అప్పుడప్పుడు యాంకర్‌గా కూడా కనిపించారు. అలాంటి స్థాయిలో ఉన్న చలాకి చంటి ఈరోజు ఈ పరిస్థితికి రావడం అభిమానులను ఎంతో బాధిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories