రాంచరణ్ 'గేమ్ ఛేంజర్' కంప్లీట్ స్టోరీ లీక్..ముగ్గురు విలన్లతో శంకర్ స్టైల్ లో వెన్నుపోటు పాలిటిక్స్

Published : Mar 16, 2024, 09:33 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శంకర్.. మరో పక్క కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. దీనితో గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతూ వస్తోంది.

PREV
16
రాంచరణ్ 'గేమ్ ఛేంజర్' కంప్లీట్ స్టోరీ లీక్..ముగ్గురు విలన్లతో శంకర్ స్టైల్ లో వెన్నుపోటు పాలిటిక్స్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శంకర్.. మరో పక్క కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. దీనితో గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతూ వస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా శంకర్ ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. 

26
Game Changer

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అందమైన నగరం వైజాగ్ లో జరుగుతోంది. వైజాగ్ షూటింగ్ నుంచి రాంచరణ్ ఫొటోస్ లీక్ అవుతున్నాయి. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన పొలిటికల్ సన్నివేశాలని శంకర్ చిత్రీకరిస్తున్నారట. ఈ చిత్రంలో రాంచరణ్ రామ్ నందన్ అనే ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. 

36

ఈ చిత్ర కథకి సంబంధించిన కీలక విషయాలు బయటకి వస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర ముగ్గురు విలన్ లు గా నటిస్తున్నారట. రాంచరణ్ ఈ చిత్రంలో తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు. రామ్ నందన్ తండ్రి ఆపన్న పేద ప్రజల బాగు కోసం పార్టీ స్థాపిస్తారు. 

46

అప్పన్నకి స్నేహితుడుగా ఉన్న శ్రీకాంత్ వెన్ను పోటు పొడిచి పార్టీని లాక్కుంటాడు. శ్రీకాంత్ తనయుడిగా ఎస్ జె సూర్య నటిస్తున్నారట. సూర్య తండ్రిని మించిన రాజకీయ స్వార్థపరుడిగా ఉంటాడు. అధికారం కోసం ఎంతో క్రూరమైన ఎత్తుగడలు వేసి ప్రజలని వేధిస్తుంటాడు. అతడి ప్లాన్ లని నవీన్ చంద్ర అమలు పరుస్తుంటాడు. సూర్య తమ్ముడిగా నవీన్ చంద్ర నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

56

తండ్రిని వెన్నుపోటు పొడిచిన సంగతి ఐఏఎస్ రామ్ నందన్ కి ఎలా తెలిసింది.. తండ్రిలాగా రాజకీయ నాయకుడు కాకుండా రామ్ నందన్ ఎందుకు ఐఏఎస్ ని ఎంచుకున్నాడు.. స్వార్థ పరుల నుంచి పార్టీని ప్రజలని రక్షించాడా లాంటి అంశాలు శంకర్ స్క్రీన్ ప్లేతో మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటాయట. పొలిటికల్ కథే అయినప్పటికీ మెగా ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేసే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బలంగా ఉంటాయని అంటున్నారు. 

66

ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గ్గా నటిస్తోంది. అంజలి, జయరాం, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లేదా డిసెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

click me!

Recommended Stories