క్వీన్ ఎలిజబెత్ II తర్వాత రామ్ చరణ్ కి ఆ అవకాశం, మేడమ్ టుస్సాడ్స్ మెగా హీరోకు ప్రత్యేక గౌరవం

Published : May 12, 2025, 06:12 PM IST

మేడమ్ టుస్సాడ్స్ లో అరుదైన గౌరవం పొందారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. క్విన్ ఎలిజబెత్ తరువాత ఆ అరుదైన అవకాశం రామ్ చరణ్ కే రావడం మరో విశేషం. ఇంతకీ రామ్ చరణ్ కే దక్కిన ఆ గౌరవం ఏంటి?  

PREV
15
క్వీన్ ఎలిజబెత్ II తర్వాత రామ్ చరణ్ కి ఆ అవకాశం, మేడమ్ టుస్సాడ్స్ మెగా హీరోకు ప్రత్యేక గౌరవం

తెలుగు సినిమా స్టార్, గ్లోబల్ హీరో  రామ్ చరణ్ కు అరుదైన అవకాశం లభించింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఆవిష్కరించబడింది. అయితే ఇప్పటిచే ఇండియా నుంచి, టాలీవుడ్ నుంచి చాలా మంది విగ్రహాలు ఉన్నాయి కదా... రామ్ చరణ్ అంత స్పెషల్ ఏంటి అని డౌట్ రావచ్చు. నిజంగా చరణ్ చాలా స్పెషల్. 

25
Queen Elizabeth II

క్విన్ ఎలిజబెత్ 11 తరువాత  రామ్ చరణ్ కే దక్కిన అవకాశం ఏంటంటే... చరణ్ తో పాటు  ఆయన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం  ఏర్పాటు చేయించుకున్నారు. ఇది భారతీయ సినీ పరిశ్రమలో ఒక అరుదైన ఘట్టం, ఎందుకంటే క్వీన్ ఎలిజబెత్ II తర్వాత తన పెంపుడు కుక్కతో కలిసి మాడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మను కలిగిఉన్న వ్యక్తిగా రామ్ చరణ్  నిలిచారు. 

35

2024లో అబుదాబీలో జరిగిన ఐఐఎఫ్‌ఏ అవార్డుల సమయంలో ఈ విషయం ప్రకటించబడింది. రామ్ చరణ్ , రైమ్ కొలతలను అప్పుడే వారు తీసుకున్నారు. ఇక ఈ విగ్రహాం తయారు చేయడం అయిపోయి లండన్ లో ఓపెనింగ్ కూడా జరిగింది. మెగా ఫ్యామిలీ అంతా ఈ ఈవెంట్ లో సందడి చేశారు. నాలుగు రోజులు ముందే వారు లండన్ చేరుకున్ని తెగ ఎంజాయ్ చేశారు. ఇక  ఈక్రమంలో దీన్ని సింగపూర్ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు.

45

ఈ ప్రత్యేక ఘట్టం రామ్ చరణ్ ఆయన పెంపుడు కుక్క రైమ్ మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. రామ్ చరణ్ ఈ ఘట్టం గురించి మాట్లాడుతూ, "మాడమ్ టుస్సాడ్స్ కుటుంబంలో చేరడం నా జీవితంలో ఒక గౌరవంగా భావిస్తున్నాను. నా పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి ఈ ఆనందం శేర్ చేసుకోవడం  మరింత ప్రత్యేకంగా ఉంది," అని అన్నారు. 

55

ఇక  సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో  మైనపు విగ్రహాలు"ఐఐఎఫ్‌ఏ జోన్"లో భాగంగా ఉంటుంది, అక్కడ ఇండియన్ సెలబ్రిటీలు అయిన  షారుఖ్ ఖాన్, కాజోల్, కరణ్ జోహార్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, బన్నీ, లాంటి స్టార్స్ మైనపు విగ్రహాలు కూడా ఉన్నాయి. 

రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే..  ప్రస్తుతం ఆయన బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈమూవీతరువాత సుకుమార్ తో మరో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నారు రామ్ చరణ్. 

Read more Photos on
click me!

Recommended Stories