Rakul Preet Singh: స్టార్ సీనియర్ హీరోకు జంటగా రకుల్ ప్రీత్ సింగ్, అందులో నిజమెంత...?

Published : Apr 16, 2022, 10:36 AM IST

స్టార్ సీనియర్ హీరోతో.. కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టబోతోందా..? ఈమధ్య బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన చిన్నది... మరోసారి సౌత్ పై దృష్టి పెట్టబోతోందా..? 

PREV
15
Rakul Preet Singh: స్టార్ సీనియర్ హీరోకు జంటగా రకుల్ ప్రీత్ సింగ్, అందులో నిజమెంత...?

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్. యూత్‌లో రకుల్‌ కు ఫుల్‌ క్రేజ్‌ ఉంది. టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలందరి సరసన నటంచిన రకుల్ ప్రీత్ సింగ్ 2017 నుంచి బాలీవుడ్‌పైనే ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం రకుల్‌ ఏకంగా 5 హిందీ సినిమాల్లో నటిస్తోంది.

25

అమితాబ్‌, అజయ్‌ దేవగణ్‌ మల్టీస్టారర్‌ మూవీ రన్‌ వే 34 ఏప్రిల్‌ 29న రిలీజ్ కు ముస్తాబు అవుతోంది. ఈ సినిమాతో పాటు  ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జీ, అజయ్ దేవగన్ , సిద్ధార్ద్ మల్హోత్రా  మల్టీస్టారర్ థ్యాంక్ గాడ్, అక్షయ్ కుమార్ తో మిషన్ సిండ్రెల్లా, ఛత్రివాలి లాంటి బాలీవుడ సినిమాల్లో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. 
 

35

ఇక సౌత్ లో రకుల్ ప్రీత్ శఖం అయిపోయింది అనుకుంటున్న టైమ్ లో సౌత్ సినిమాలపై మరోసారి రకుల్ ప్రీత్  సింగ్ పఓసక్ చేసినట్టు తెలుస్తంది.  తాజాగా ఈ భామ ఓ తమిళ సినిమాకి సైన్ చేసినట్లు సమాచారం. అది కూడా స్టార్ సీనియర్ హీరోకు జోడీగా నటించబోతోందట. 

45

హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.  ఈ సినిమాలో అజిత్‌కు జోడిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను సెలెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. 

55

ఇప్పటికే దీని గురించి చర్చలు పూర్తయి, కథ నచ్చడంతో రకుల్‌ ఓకే చెప్పినట్లు కోలీవుడ్‌ లో టాక్‌ వినిపిస్తోంది. గిబ్రాన్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు.

click me!

Recommended Stories