Alia Bhatt First Crush: ఆలియా భట్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా...? నటనలో ఆ హీరోయిన్ తన స్పూర్తి అంటోంది

Published : Apr 16, 2022, 09:36 AM IST

రీసెంట్ ఓ పెళ్లి పీటలు ఎక్కింది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. బాలీవుడ్ యంగ్ స్టార్ రణ్ భీర్ తో ఏడడుగులు నడించింది. 5 ఏళ్ల ప్రమేకు పెళ్ళి బంధం వేసుకున్నారు జంట. ఈ సందర్భంగా ఆలియా భట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆమె ఫస్ట్ క్రష్ ఎవరు..లాంటి విషయాలు తెలుసుకుందాం..? 

PREV
18
Alia Bhatt First Crush: ఆలియా భట్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా...? నటనలో ఆ హీరోయిన్ తన స్పూర్తి అంటోంది

బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఉన్న మహేష్ బట్ కూతురు ఆలియా భట్.. ఇండస్ట్రీలో మాత్రం తను కష్టపడి సోంత ఇమేజ్ ను సాధించింది. హీరోయిన్ గా చిన్న వయస్సులోనే స్టార్ డమ్ ను అందకుంది ఆలియా భట్. ట్రిపుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా  సినిమాలో మెరుపులు మెరిపించింది. 

28

ఇక సావారియా సినిమా టైమ్ లో రణ్ బీర్ తో ప్రేమలో పడ్డ ఆలియా.. యంగ్ స్టార్ ను ఇంప్రెస్ చేసి ప్రేమలోకి దింపింది. దాదాపు 5 ఏళ్ళకు పైగా ప్రేమించుకున్న వీరు.. రీసెంట్ గా పెళ్ళి చేసుకుని ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేశారు. అంతకు మందు ప్రేమికులుగా లవ్ టూర్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. 

38

ఆలియా భట్ తన ఫస్ట్ క్రష్ గురించి చాలా సార్లు చెప్పింది. తనకు షారుఖ్ అంట చాలా ఇష్టమంది బ్యూటీ. నటనలో మాత్రం తాను శ్రీదేవిని ఆరాధిస్తానంటోంది. షూటింట్ లో టైమ్ ఫాలో అవ్వడం, ఆహ్లాదకర వాతావరణంలో పని చేసుకోవడం తన కు ఇష్టమట. 

48

ఇక ట్రిపుల్ ఆర్ లో నటించడం తనకు దక్కిన గొప్ప అదృష్టమంటోంది ఆలియా భట్. అయితే రాజమౌళితో సినిమా తన డ్రీమ్ అట. ఓ సారి ఎయిర్ పోర్ట్ లో రాజమౌళిని చూసి.. విష్ కూడా చేయకుండా.. వెళ్ళి వెంటనే తనకు సినిమా ఛాన్స్ ఇవ్వమని అడిగిందంట. దానికి జక్కన్న నవ్వుతూ.. సరే అనేశాడట. తరువాత ట్రిపుల్ ఆర్ కోసం రాజమౌళి స్వయంగా ఆలియాకు ఫోన్ చేశాడట కూడా. 

58

ఆలియాకు చీకటంటే చచ్చేంత భయమట. అందుకే తన బెడ్ రూమ్ లో టైట్ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందట. నైట్ కూడా లైట్ వేసుకునే పడుకుంటుందట. ఇక పప్పన్నం, పీజాలు రెండింటిని ఇష్టపడే ఆలియా భట్.. కొండ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటుందట. 

68

ఆలియా మంచి నటి మాత్రమే కాదు. సింగర్ కూడా. ఏఆర్ రెహమాన్ దగ్గర శిష్యరికం చేసి.. సంగీతం నేర్చుకుందట. అంతే కాదు  ఉడ్ తా పంజాబ్ తో పాటు మరికొన్ని సినిమాల్లో దాదాపు నాలుగు పాటులు పాడింది ఆలియా భట్. 
 

78

స్టార్ డైరెక్టర్ మహేష్ బట్ కూతురు ఆలియా భట్. తన తండ్రితో కలిసి సరదాగా వైకుంఠపాళి ఆడుతుంది. అంతే కాదు తన పేరు కూడా సర్వోన్నతమైన వ్యక్తి అని అర్ధం వచ్చేలా సెలక్ట్ చేసి మరీ పెట్టాడట మహేష్ భట్. ఆలియా అంటే అరబిక్ లో సర్వోన్నతమైన వ్యక్తి అని అర్ధం. 
 

88

నటనలో ప్రయోగాలు చేస్తూ.. చిన్న వయస్సులోనే గోప్ప పేరు సంసాధిస్తుంది ఆలియా భట్. గంగూబాయి కతియా వాడి, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు ఆమె ఇమేజ్ ను అమాంతం పెంచేశాయి. నటిగా మరిన్ని ప్రయోగాలకు తాను సిద్దంగా ఉన్నట్టు తెలిపింది ఆలియా భట్. 

click me!

Recommended Stories