ఇప్పటికే కాజల్ అగర్వాల్ షూట్ ప్రారంభం అంటూ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రకుల్ కూడా షూట్ కు హాజరైనట్టుగా ఫొటోలు షేర్ చేయడం పట్ల ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. దీంతో ‘ఇండియన్ 2’ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందని తెలుస్తోంది. సౌత్ ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను అలరించేందుకు అటు కాజల్ కు, ఇటు రకుల్ కు ఈ చిత్రం ప్లస్ అని చెప్పాలి.