రెడ్‌ డ్రెస్‌లో రకుల్‌ అందాల విస్పోటనం.. బాత్‌ రూమ్‌లో ఆ విరహ వేదన చూస్తే.. మీటర్లు బద్దలే!

Aithagoni Raju | Published : Oct 30, 2023 10:44 PM
Google News Follow Us

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. తెలుగులో సినిమాలు చేసి నాలుగేళ్లు అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు బాలీవుడ్‌ హీరోయిన్‌ అయిపోయింది. కానీ ఈ అమ్మడిని తెలుగు ఆడియెన్స్‌ సోషల్‌ మీడియాలో ఆదరిస్తూనే ఉన్నారు. 
 

18
రెడ్‌ డ్రెస్‌లో రకుల్‌ అందాల విస్పోటనం.. బాత్‌ రూమ్‌లో ఆ విరహ వేదన చూస్తే.. మీటర్లు బద్దలే!
photo credit Rakul instagram

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(Rakul Preet Sigh) తెలుగులో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. జయాపజయాలకు అతీతంగా అవకాశాలు దక్కించుకుని స్టార్‌ హీరోలతో ఆడి పాడింది. పలు విజయాలు, మరికొన్ని పరాజయాలను చవి చూసింది. కానీ ఒక ఐదారేళ్లు మాత్రం టాలీవుడ్‌ని ఊపేసింది. స్టార్‌ హీరోయిన్ల టాప్‌ లీగ్‌లో నిలిచింది. 
 

28
photo credit Rakul instagram

రకుల్‌.. సీనియర్‌ హీరోల్లో నాగార్జునతోపాటు కూడా కలిసి నటించింది. ఇక మిగిలిన స్టార్స్ అందరితోనూ ఆడిపాడింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీ, గోపీచంద్‌, రవితేజ, సాయిధరమ్‌ తేజ్‌, రామ్‌, ఆది సాయికుమార్‌ వంటి హీరోలందరితోనూ జోడీ కట్టింది. 

38
photo credit Rakul instagram

కానీ తెలుగులో ఈ బ్యూటీకి పెద్దగా విజయాలు దక్కలేదు. చివర్లో వరుసగా పరాజయాలే చవి చూశాయి. దీంతో టాలీవుడ్‌లో మూవీస్‌ తగ్గించింది. బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది. అక్కడ వరుస ఆఫర్లని అందుకుంది. బాలీవుడ్‌ వెళ్లాక ఆమె గ్లామర్‌ డోస్‌ కూడా పెంచింది. ఊహించని విధంగా అందాల ఆరబోతకు తెరలేపి షాకిచ్చింది. 
 

Related Articles

48
photo credit Rakul instagram

ఆ తర్వాత వరుసగా గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తుంది. కరోనా అనంతరం సోషల్‌ మీడియా ప్రభావం పెరిగింది. అన్నింటికి అదే ఆధారం అవుతుంది. అక్కడే అంతా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే సామాజిక మాధ్యమాల చుట్టూతే అన్నీ జరుగుతున్నాయి. దీంతో దాని వేదికగా అందాల విందు చేస్తూ నెటిజన్లని ఆకర్షిస్తుంది రకుల్.
 

58
photo credit Rakul instagram

తాజాగా మరోసారి ఆమె అందాల విస్పోటనం చెందింది. రెడ్‌ డ్రెస్‌లో ఆమె రెచ్చింది. బిగువైన టాప్‌లో ఎద అందాల తల్లడిల్లిపోతుండగా, క్రేజీ లుక్స్ తో కైపెక్కిస్తుంది. మరోవైపు బాత్‌ రూమ్‌లో ఈ భామ ఈ క్రేజీ షూట్‌ మరో స్థాయిలో ఉంది. అయితే బాత్‌రూమ్‌లో ఆమె విరహ వేదన చెందుతూ ఇచ్చిన పోజులు మాత్రం మైండ్‌ బ్లాక్‌ అనేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ రెడ్‌ డ్రెస్‌ ఫోటో షూట్‌ పిక్స్ సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. 
 

68
photo credit Rakul instagram

మూడేళ్లుగా బాలీవుడ్‌లో బిజీగా గడిపింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అక్కడ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేసింది. `దే దే ప్యార్‌ దే` మూవీ ఆమె కెరీర్‌ని మలుపు తిప్పింది. అజయ్‌ దేవగన్‌ సపోర్ట్ తో హిందీలో ఆఫర్లు అందుకుని దూసుకుపోయింది. కేవలం మూడేళ్లలో ఆమె దాదాపు పది సినిమాల్లో భాగం కావడం విశేషం. 
 

78
photo credit Rakul instagram

అయితే అక్కడ కూడా ఈ బ్యూటీకి సక్సెస్‌ రాలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ పరిస్థితి మొదటకొచ్చింది. ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశానికి ఓకే చెప్పింది. స్క్రిప్ట్, తన పాత్రలకు ప్రయారిటీ అనేది చూసుకోలేదు. దీంతో ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. 
 

88
photo credit Rakul instagram

ఇప్పుడు ఆఫర్లు తగ్గాయి. హిందీలో ఒకటి, తమిళంలో ఒకటి సినిమా చేస్తుంది. కొత్త అవకాశాల వేటలో బిజీగా ఉంది. అందుకు అందాలను నమ్ముకుంటుంది. అదే సమయంలో ముంబయిలో ఈవెంట్‌లో పాల్గొంటూ గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ అలరిస్తుందీ రకుల్‌.

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Share this Photo Gallery
Google News Follow Us
Recommended Photos