కాజల్ అగర్వాల్ పెళ్లిరోజు.. రేర్ అండ్ రొమాంటిక్ ఫొటోలతో భర్తకు చందమామ విషెస్

First Published | Oct 30, 2023, 6:08 PM IST

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పెళ్లై అప్పుడే మూడేళ్లు గడిచింది. ఈ సందర్భంగా చందమామ తన భర్తతో కలిసి ఉన్న రేర్ ఫొటోలను షేర్ చేసుకుంటూ అతనికి శుభాకాంక్షలు తెలిపింది. 

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)  ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేస్తోంది. తన పెళ్లి, డెలివరీ కారణంగా కాస్తా గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెడుతోంది.
 

ఇక కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఈ ముద్దుగుమ్మ తన కొత్తింట్లో అడుగుపెట్టినట్టు గృహప్రవేశ పూజకు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఈ తాజాగా మరికొన్ని రేర్ పిక్స్ ను షేర్ చేసింది. 


మూడేళ్ల కింద సరిగ్గా ఇదేరోజు కాజల్ అగర్వాల్ పెళ్లి పీటలు ఎక్కింది. ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును కాజల్ పెళ్లి చేసుకుంది. గతేడాది ఓ పండంటి మగబిడ్డకూ జన్మినిచ్చింది. కొడుకు నీల్ కిచ్లు అని నామాకరణం చేసిన విషయం తెలిసిందే. 
 

కాజల్ థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తన భర్తకు క్యూట్ అండ్ రొమాంటిక్ ఫొటోలతో కూడిన వీడియోను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపింది. ఎంతో స్నేహపూర్వకంగా మూడేళ్లు గడిచిందంటూ పోస్టు పెట్టింది. వీరి రేర్ పిక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 
 

కాజల్, గౌతమ్ కిచ్లు జంటగా పలు వేకేషన్లు, టూర్లకు తిరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా భర్తతో క్యూట్ గా ఫోజులిచ్చిన పిక్స్ ను అభిమానులతో షేర్  చేసుకుంది. ఈ అరుదైన చిత్రాలకు ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు. అలాగే పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 

ఇక కాజల్ తన కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. ఇప్పటికే ‘ఘోస్టీ’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలతో అలరించంది. ప్రస్తుతం ‘ఇండియన్ 2’, ‘సత్యభామ’, ‘ఉమ’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇకపై వరుస చిత్రాలతో అలరించబోతోంది.
 

Latest Videos

click me!