పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ` అసలు కథ ఇదే?.. వర్కౌట్‌ అయితే పాన్‌ ఇండియా షేకే!

First Published | Oct 30, 2023, 8:34 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఓజీ`పై భారీ అంచనాలున్నాయి. గ్యాంగ్‌ స్టర్‌ నేపథ్యంలో రూపొందుతున్న మూవీ కావడం, టీజర్‌ అదిరిపోయేలా ఉండటంతో ఆసక్తి ఏర్పడింది. 

పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan).. ఇప్పటి వరకు పాన్‌ ఇండియా సినిమాలు చేయలేదు. పైగా ఇటీవల స్ట్రెయిట్‌ మూవీస్‌ కూడా చేయలేదు. `అజ్ఞాతవాసి` ఫ్లాప్‌ కావడంతో వరుసగా రీమేక్‌లు ఎంచుకున్నారు. ఈ క్రమంలో `వకీల్‌సాబ్‌`, `భీమ్లా నాయక్‌`, `బ్రో` చిత్రాలు చేశారు. `వకీల్‌ సాబ్‌` హిట్‌ కాగా, `భీమ్లా నాయక్‌` యావరేజ్‌గా ఆడింది. `బ్రో` పెద్దగా ఆడలేదు. ఇప్పుడు వరుసగా స్ట్రెయిట్‌ మూవీస్‌తో వస్తున్నారు పవన్‌. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `ఓజీ`(OG), `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, `హరిహర వీరమల్లు` చిత్రాలు ఒరిజినల్‌ స్క్రిప్ట్ లతో రూపొందుతున్నాయి. 

Pawan kalyan OG Glimpse

ఇందులో `హరిహర వీరమల్లు` చిత్రం చిత్రీకరణ ఆగిపోయింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు షూటింగ్‌ పూర్తి చేసుకుంటుంది, ఎప్పుడు రిలీజ్‌ అవుతుందనేది పెద్ద సస్పెన్స్. ఇక `ఉస్తాద్‌ భగత్‌ సింగ్`, `ఓజీ` చిత్రాలు ముందుగా రాబోతున్నాయి. పవన్‌ ప్రాధాన్యత `ఓజీ`కి ఉన్నట్టు తెలుస్తుంది. `ఉస్తాద్‌` షూటింగ్‌లోనూ పాల్గొంటున్నప్పటికీ, `ఓజీ`ని ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏపీ ఎన్నికల తర్వాతనే రిలీజ్‌ ఉంటుందంటున్నారు. 


Pawan kalyan OG Glimpse

ఇదిలా ఉంటే `ఓజీ` చిత్రం మాఫియా, గ్యాంగ్‌ స్టర్‌ కథతో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. ఇందులో ముంబయికి చెందిన గ్యాంగ్‌ స్టర్‌గా పవన్‌ కనిపించబోతున్నారు. టీజర్‌లో ఆయన లుక్‌, యాక్షన్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంది. పవన్‌లోని నెక్ట్స్ లెవల్‌ని చూపించింది. సినిమాపై అంచనాలను పెంచింది. అయితే ఈ సినిమా స్టోరీకి సంబంధించిన విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

మార్షల్‌ ఆర్ట్స్, యాక్షన్‌ ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. కొరియన్‌ దేశానికి సంబంధం ఉంటుందని టైటిల్‌, అందులోని కోడ్‌ని చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ సినిమా ప్రధానంగా 1980లో సాగుతుందట. ముంబయి బ్యాక్‌ డ్రాప్‌లో సాగే గ్యాంగ్‌ స్టర్‌ డ్రామా చిత్రమని అంటున్నారు. ఒక సాధారణ కుర్రాడు ముంబయికి వచ్చి గ్యాంగ్‌ స్టర్‌గా ఎలా ఎదిగాడు, ఎందుకు గ్యాంగ్‌ స్టర్‌ అయ్యాడనేది ఈ చిత్ర కథ అని టాక్‌. మాఫియాలోకి వెళ్లడానికి దారితీసిన అంశాలేంటనేది ఇందులో హైలైట్‌గా ఉండబోతున్నాయట. 

Pawan kalyan OG Glimpse

ఇది గ్యాంగ్‌ స్టర్‌ మూవీ అయినా, ఫ్యామిలీ ఎలిమెంట్లు ఉంటాయనేది ఇప్పుడు లేటెస్ట్ గా తెలుస్తున్న వార్త. ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఉందులో ప్రధానంగా చూపించబోతున్నారట దర్శకుడు సుజీత్‌. పవన్‌ పాత్రలో పెద్ద మలుపు ఫ్యామిలీ అంశాల వల్లే అని, మాఫియా కారణంగా ఆయన ఫ్యామిలీకి ఏమైంది? దీంతో ఓజీ తీసుకునే నిర్ణయం మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని, దీంతో సినిమా కథే మారిపోతుందని తెలుస్తుంది. 
 

Pawan kalyan OG Glimpse

అంతేకాదు `ఓజీ` అంటే ఇప్పటి వరకు ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ అని, `దే కాల్‌ హిమ్‌ ఏజీ` అని చెబుతూ వచ్చారు. కానీ అసలు పేరు వేరే ఉందట. ఓజీ అంటే ఓజాస్‌ గంభీర్‌ అని లేటెస్ట్ న్యూస్‌. అది సినిమాలో హీరో పేరు అని అంటున్నారు. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈ లేటెస్ట్ సమాచారం మాత్రం పవన్‌ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేలా ఉంది. ఇదే నిజమైతే, దీన్ని దర్శకుడు సుజీత్‌ అదే రేంజ్‌లో తెరకెక్కిస్తే `ఓజీ` పవన్‌ కి నెక్ట్స్ లెవల్‌ మూవీ అవుతుందని, ఈ దెబ్బతో పాన్‌ ఇండియా బాక్సాఫీసు షేక్‌ కావడం ఖాయమంటున్నారు. పవన్‌ చేస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ పవర్‌ ఏంటో ఈ సినిమా చాటి చెబుతుందని అంటున్నారు. 
 

దీనికితోడు పవన్‌ ఇమేజ్‌, యాక్షన్‌ సీన్లకి తగ్గట్టుగానే ఎలివేషన్లు ప్లాన్‌ చేస్తున్నారట. థమన్‌ బీజీఎం హైలైట్‌గా ఉండేలా జాగ్రత్త పడుతున్నారట. ఇటీవల ఎలివేషన్లు ఉన్నా మూవీస్‌ బాగా ఆడుతున్నాయి. అదే కోవలో `ఓజీ`ని ప్లాన్‌ చేస్తున్నారట. మరి ఈ మూవీ ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇందులో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రియా రెడ్డి కీలక పాత్రలో నటిస్తుంది. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇందులో సర్‌ప్రైజింగ్‌ కాస్టింగ్‌ ఉంటుందని టాక్‌. ఇక `ఓజీ` రెండు భాగాలుగా రాబోతుంది. తొలి భాగం సమ్మర్‌లో, రెండో భాగం 2015లో రిలీజ్‌ చేస్తారని టాక్‌.
 

Latest Videos

click me!