Devara Japan: 'దేవర' కోసం ఎన్టీఆర్ జపాన్ పర్యటన

Published : Feb 26, 2025, 04:28 PM IST

  Devara Japan: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'దేవర: పార్ట్ 1' జపాన్‌లో విడుదల కానుంది. భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం జపాన్‌లో కూడా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. దేవర పార్ట్ 2 కూడా త్వరలో రానుంది.

PREV
13
  Devara Japan: 'దేవర' కోసం ఎన్టీఆర్ జపాన్ పర్యటన
Ntr, Koratala Siva devara movie to be released in japan this date in Telugu


  Devara Japan: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన చిత్రం ‘దేవర: పార్ట్‌ 1’. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన కలెక్షన్స్ వసూలు చేసింది.

 దసరా సందర్భంగా సెప్టెంబర్‌ 27న విడుదలైన ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీగా లాభ పడ్డారని నాగవంశీ తెలిపారు. ఇప్పుడీ   బ్లాక్ బస్టర్ "దేవర పార్ట్-1" జపాన్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

23
Ntr, Koratala Siva devara movie to be released in japan this date in telugu


 ఈ సినిమా మార్చి 28న జపాన్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను దేవర మూవీ టీం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసారు.ఇప్పటికే ఆర్ఆర్ఆర్‌తో పాటు పలు టాలీవుడ్ సినిమాలు జపాన్‌లో కూడా హిట్ అయ్యాయి.

ఇప్పుడు, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన "దేవర" కూడా జపాన్‌లో విడుదలకానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు స్టార్ట్ చేసారు ఎన్టీఆర్, జపాన్‌ అభిమానులతో వర్చువల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఫోటోలను దేవర మూవీ టీం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసారు.  జూనియర్ ఎన్టీఆర్ మార్చి 22న జపాన్‌లో పర్యటించనున్నారు. 

33
Ntr, Koratala Siva devara movie to be released in japan this date in Telugu


దాదాపు రూ. 300 కోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కిన దేవ‌ర బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఓటీటీలో కూడా  బాగా వర్కవుట్ అయ్యింది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మించారు.  

 "దేవర పార్ట్-1"  లో  సైఫ్‌ అలీఖాన్‌, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌ వంటి స్టార్స్‌ కీలకపాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. దేవర పార్ట్‌2 కూడా ఉందని ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు.

Read more Photos on
click me!

Recommended Stories