Nayanthara Wedding: నయన్, విగ్నేష్ వెడ్డింగ్.. రజనీకాంత్, షారుక్ ఇంకా తరలి వస్తున్న తారలు

Published : Jun 09, 2022, 11:21 AM IST

వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందాల భామ నయనతార ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కుతోంది. ఈ ఉదయం 8:30 నుంచి నయనతార, విగ్నేష్ శివన్ ల వివాహం ప్రారంభం అయింది.

PREV
16
Nayanthara Wedding: నయన్, విగ్నేష్ వెడ్డింగ్.. రజనీకాంత్, షారుక్ ఇంకా తరలి వస్తున్న తారలు

వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందాల భామ నయనతార ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కుతోంది. ఈ ఉదయం 8:30 నుంచి నయనతార, విగ్నేష్ శివన్ ల వివాహం ప్రారంభం అయింది. దాదాపు ఏడేళ్ల సహజీవనానికి తెరదించుతూ వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. నయనతార సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ గా కీర్తి పొందింది. 

26

అందంతో, అభినయంతో నయనతార చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసింది. యువతలో నయనతారకి ఎంతటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనితో నయనతార వివాహంపై అందరిలో సహజమైన ఆసక్తి ఉంటుంది. ఇక విగ్నేష్ శివన్ కూడా యువ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

36

వీరిద్దరి వివాహానికి తారలు తరలి వస్తున్నారు. మహాబలిపురంలో వైభవంగా జరుగుతున్న నయనతార పెళ్ళికి అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, షారుఖ్ ఇప్పటికే మహాబలిపురం చేరుకున్నారు. 

46

రజనీకాంత్ తో నయనతార చంద్రముఖి, దర్బార్, అన్నాత్తే లాంటి చిత్రాల్లో నటించింది. ఇక షారుఖ్ ఖాన్ తో  అట్లీ దర్శకత్వంలో 'జవాన్' చిత్రంలో నటిస్తోంది. అలాగే హీరో కార్తీ, నిర్మాత బోని కపూర్ కూడా హాజరవుతున్నారు. ఇక నయనతార వివాహానికి సంబందించిన ఎలాంటి లుక్ బయటకి రాకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. 

56

మహాబలిపురం చారిత్రాత్మక ప్రాంతం మాత్రమే కాదు.. అందమైన ప్రకృతి దృశ్యాలు ఉన్న ప్రదేశం కూడా. కాబట్టి నయనతార విగ్నేష్ శివన్ లు తమ వివాహానికి వేదికగా మహాబలిపురంని ఎంచుకున్నారు. 

66

అలాగే విజయ్ సేతుపతి, శరత్ కుమార్, దర్శకుడు అట్లీ కూడా నయనతార వివాహానికి హాజరవుతున్నారు. కోలీవుడ్ నుంచి చాలా మంది గెస్ట్ లు హాజరవుతున్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్ నుంచి ఎవరు వెళతారనేది ఇంకా క్లారిటీ లేదు. 

click me!

Recommended Stories