ఇద్దరు మిత్రులు... వైట్ అండ్ వైట్ ధరించి జెంటిల్ లుక్ లో టాప్ లేపిన రజినీ, మోహన్ బాబు!

First Published May 21, 2021, 12:03 PM IST

వైట్ అండ్ వైట్ ధరించి జెంటిల్ లుక్ లో కలిసి ఫోటో షూట్చే శారు సూపర్ స్టార్ రజినీకాంత్,కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. వీరితో మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు సైతం జాయిన్ కాగా, ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. 
 

దశాబ్దాలుగా పరిశ్రమలలో మంచి మిత్రులుగా మోహన్ బాబు, రజినీకాంత్ ఉన్నారు. సందర్భం కుదిరితే చాలు ఇద్దరూ కలిసి సమయం గడపడానికి మొగ్గుచూపుతారు.
undefined
ఇటీవల రజినీకాంత్ తన లేటెస్ట్ మూవీ అన్నాత్తే షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. షూటింగ్ ముగించుకొని చెన్నై వెళ్లబోయే ముందు రజినీకాంత్, మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో వీరు చిన్న ఫోటో షూట్ చేసినట్లు తెలుస్తుంది.
undefined
మంచు మనోజ్ మోహన్ బాబు, రజినీ ఫోటోలు తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయగా మంచి రెస్పాన్స్ దక్కింది. రజినీకాంత్, మోహన్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో ఈ ఫోటో షూట్ పై అభిప్రాయం తెలియజేస్తున్నారు.
undefined
ఇక మోహన్ బాబు కెరీర్ లో అతిపెద్ద హిట్ మూవీగా ఉన్న పెద్దరాయుడు మూవీలో రజినీకాంత్ తక్కువ నిడివి కలిగిన కీలక రోల్ చేశారు. పాపారాయుడుగా మోహన్ బాబు తండ్రి పాత్ర రజినీ చేయడం జరిగింది.
undefined
కాగా రజినీకాంత్ రాజకీయాల నుండి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం వెనుక మోహన్ బాబు సలహా ఉందని కూడా ఓ వాదన ఉంది. మోహన్ బాబు, చిరుల సలహా మేరకే ఆయన రాజకీయాలలోకి రాకూడదని నిర్ణయం తీసుకున్నారట.
undefined
దాదాపు ఒకే సమయంలో రజినీకాంత్, మోహన్ బాబు సినీ ప్రయాణం మొదలైంది. రజినీకాంత్ సూపర్ స్టార్ గా ఆల్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకోగా, మోహన్ బాబు విలక్షణ నటుడిగా అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించారు.
undefined
వీరిద్దరి కెరీర్ లో ఉన్న మరో సారూప్యత ఏమిటంటే విలన్స్ గా మొదలు పెట్టి హీరోలుగా మారారు. రజినీకాంత్ కూడా కెరీర్ బిగినింగ్ లో అనేక చిత్రాలలో విలన్ రోల్స్ చేశారు. మోహన్ బాబు 90లలో కూడా విలన్ రోల్స్ చేయడం విశేషం.
undefined
click me!