అంత ధైర్యం నాకు లేదు, ఎంజీఆర్ గురించి పొరపాటున తప్పుగా మాట్లాడా.. క్షమాపణ కోరిన రాజేంద్ర ప్రసాద్

Published : Mar 13, 2026, 06:20 PM IST

రాజేంద్ర ప్రసాద్ తరచుగా ఏదో ఒకటి మాట్లాడుతూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల ఆయన ఎంజీఆర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వివాదం పెద్దది కావడంతో రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. 

PREV
15
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఆయన తమిళులు ఆరాధ్య దైవంలా భావించే ఎంజీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. లెజెండ్రీ నటుడు కాంతారావుపై ప్రశంసలు కురిపించారు. అది కాంతారావు అవార్డుల ఫంక్షన్.

25
ఎంజీఆర్ పై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు

కాంతారావుని పొగిడే క్రమంలో ఎంజీఆర్ పై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనితో రాజేంద్ర ప్రసాద్ మాటలు తమిళుల మనోభావాలు దెబ్బ తీశాయి. వెంటనే విశాల్, నాజర్ లాంటి వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

35
పొరపాటున కొన్ని మాటలు మాట్లాడా

తన కామెంట్స్ వల్ల డ్యామేజ్ ఎక్కువవుతోంది అని గ్రహించిన రాజేంద్ర ప్రసాద్ తాజాగా వీడియో బైట్ రిలీజ్ చేసి క్షమాపణలు చెప్పారు. నమస్తే.. నేను తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్ ని. రెండు రోజుల క్రితం కాంతారావు అవార్డుల వేడుకలో కొన్ని కామెంట్స్ చేశాను. అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు. సరదాగా మాట్లాడుతూ తమిళులు దైవం లా భావించే ఎంజీఆర్ గురించి పొరపాటున కొన్ని మాటలు మాట్లాడా.

45
క్షమాపణలు కోరుతున్నా

ఆయన్ని నేను కూడా దైవంలా భావిస్తా. అలాంటి వ్యక్తి గురించి వ్యాఖ్యలు చేసేంత ధైర్యం నాకుందా ? ఈ విషయాన్ని కొందరు అనవసరంగా పెద్దది చేస్తున్నారు. నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నా. నేను చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటిస్తున్నప్పుడు ఆయన సీఎం. ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

55
ఇది తొలిసారి కాదు

రాజేంద్ర ప్రసాద్ ఇలా చిక్కుల్లో పడడం ఇది తొలిసారి కాదు. గతంలో డేవిడ్ వార్నర్ ని కూడా పొరపాటున అసభ్యకరమైన మాట అన్నారు. అలీ విషయంలో కూడా చిక్కుల్లో పడ్డారు.

Read more Photos on
click me!

Recommended Stories