NBK vs MM: బాలకృష్ణ, మంచు మనోజ్ కాంబినేషన్‌లో గతంలో ఓ సినిమా వచ్చింది. అది డిజప్పాయింట్ చేసింది. మరి ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది.
ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, ఏ భాషల్లో అయినా మల్టీస్టారర్ చిత్రాలు కామన్‌గానే వస్తున్నాయి. స్టార్ హీరో సినిమాల్లో మరో స్టార్ మెరవడం కామన్ గానే జరుగుతుంది. బలమైన పాత్రలుంటే కాసేపు మెరవడానికి ఎవరైనా రెడీ అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ సెట్ కాబోతుంది. బాలకృష్ణ, మంచు మనోజ్ కలిసి నటించబోతున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఆ సంగతులేంటో చూద్దాం.
25
ఎన్బీకే 111లో నటిస్తున్న బాలకృష్ణ
ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఎన్బీకే111 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ముంబయి బేస్డ్ గా గ్యాంగ్ స్టర్ కథతో ఈ మూవీ సాగుతుందని సమాచారం. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. నేడు గోపీచంద్ మలినేని పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఆయనకు విషెస్ కూడా తెలిపింది టీమ్.
35
బాలయ్య సినిమాలో మంచు మనోజ్
ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇందులో మంచు మనోజ్(ఎంఎం) నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఓ కీలక పాత్రలో మనోజ్ నటిస్తున్నట్టు టాక్. అయితే ఆయన ఇటీవల విలన్ రోల్స్ చేయడానికి రెడీ అంటున్నారు. `మిరాయ్` మూవీలో విలన్‌గా చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బాలయ్య చిత్రంలో కూడా ఆయన విలన్‌గా కనిపిస్తాడని టాక్. కానీ బాలయ్య, మంచు మనోజ్ కాంబినేషన్‌లో సినిమా అనే వార్త మాత్రం ఇప్పుడు అభిమానులను అలరిస్తోంది.
ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో కలిసి నటించిన ఎన్బీకే, ఎంఎం
ఇదిలా ఉంటే బాలకృష్ణ, మంచు మనోజ్ కాంబినేషన్‌లో ఇప్పటికే `ఊ కొడతారా ఉలిక్కి పడతారా` అనే చిత్రం వచ్చింది. 2012లో ఇది విడుదలైంది. శేఖర్ రాజా దర్శకుడు. ఫాంటసీ యాక్షన కామెడీగా వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది. ముఖ్యంగా బాలయ్య, మంచు మనోజ్ పాత్రలు ఆడియెన్స్ కి ఎక్కలేదు. అటు హర్రర్‌లా లేదు, ఇటు హిస్టరిగా లేదని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రాబోతుందని టాక్. మరి ఇదే నిజమైతే ఈ సారి అయినా హిట్ కొడతారా అనేది చూడాలి.
55
డేవిడ్ రెడ్డితో బిజీగా ఉన్న మంచు మనోజ్
ప్రస్తుతం మంచు మనోజ్ `డేవిడ్ రెడ్డి` అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. అప్పుడు బ్రిటీష్ వాళ్లని ఎదురించిన డేవిడ్ రెడ్డి కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఆ మధ్య విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలు పెంచింది. మరోవైపు ఈ మూవీ కోసం మంచు మనోజ్ సరికొత్త మేకోవర్‌లోకి మారిపోతున్నారు. గత మూడు వారాలుగా వర్కౌట్ చేస్తున్నారు. తనని తాను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ఫోటోలు ఆకట్టుకున్నాయి. అలరించాయి.