భర్త స్టేజ్ మీద ఏడవడం చూసి కింద కూర్చున్న సుమ కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. లాస్ట్‌లో "లవ్ యూ సుమ" అని చెప్తూనే రాజీవ్ కన్నీళ్లు తుడుచుకుంటూ స్టేజ్ దిగారు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్లిన సుమ, భర్త చేయి పట్టుకుని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు. తన చేతులతో భర్త కన్నీళ్లు తుడిచి ఓదార్చారు.
ఈ స్టార్ కపుల్ మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమను, ఈ ఎమోషనల్ మూమెంట్‌ను చూసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేనితో పాటు అక్కడున్న గెస్ట్‌లంతా చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఫెస్టివల్స్ ఫర్ జాయ్
ఇది తెలుగు ఇండస్ట్రీ టాప్ యాంకర్ సుమ కనకాల స్థాపించిన రిజిస్టర్డ్ నాన్-ప్రాఫిట్ ఎన్జీవో (Non-Profit NGO). సమాజంలో ఉన్న పేదలు, అనాథ పిల్లల ముఖాల్లో నవ్వులు పూయించాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థను మొదలుపెట్టారు. రీసెంట్‌గానే ఈ సంస్థ విజయవంతంగా 5 వసంతాలు (5th Anniversary) పూర్తి చేసుకుంది.