Shekar Movie twitter Review: శేఖర్ మూవీ ట్విట్టర్ టాక్, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ లో అది మిస్ అయ్యిందిగా...?

First Published May 20, 2022, 7:55 AM IST

పోలీస్ ఆఫీసర్ గామరోసారి అదరగొట్టేశాడు రాజశేఖర్.జీవిత డైరెక్షన్ లో తెరకెక్కిన శేఖర్ మూవీ ఈరోజు(20మే) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈసినిమా ఎలా ఉంది..? రాజశేఖర్ అనుకున్నది సాధ్యమైనట్టేనా..? ట్విట్టర్ లో ఆడియన్స్ ఏమంటున్నారో  చూద్దాం..? 

డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిచిన సినిమా శేఖర్. ఈ సినిమా రిలీజ్ అయ్యి.. థియేటర్లలో సందడి చేస్తోంది.ఈ మూవీ గురించి ట్విట్టర్ లో ఆడియన్స్ రివ్యూస్ ఇస్తున్నారు మరి వాళ్లేమన్నారో చూద్దాం. 

ఇక ఈసినిమా కథ విషయానికి వస్తే.. శేఖర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్...క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, క్రైమ్ కేసులు చేధించడంలో నిపుణుడు. నేరస్తులు ఎవరైనా ఇట్టే కనిపెట్టే అంత టాలెంట్ ఉన్న మాస్టర్, అతని నైపుణ్యాన్ని ఉపయోగించి, పోలీసు అధికారులు డబుల్ మర్డర్ కేసును ఛేదించడానికి అతని సహాయం తీసుకుంటారు. ఈ ప్రాసెస్ లో అతని భార్య ఇందు  నుండి విడిపోయిన అతని జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. ఒకరోజు ఇందుకు యాక్సిడెంట్ అవుతుంది.. దురదృష్టవశాత్తు ఆసుపత్రిలో ఆమె చనిపోతుంది. 

ఆమెచావు మీద అనుమానంతో వెంటనే శేఖర్ తన తన ఇన్వెస్టిగేషన్ ని ప్రారంభిస్తాడు.  తన భార్య యాక్సిడెంట్‌తో చనిపోలేదని,ఎవరో హత్య చేశారని తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది. చివరకు భార్యను హత్య చేసింది ఎవరు? అతను కేసును పరిష్కరిస్తాడా? ఇందు అతని నుండి ఎందుకు విడిపోయింది? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. డా.రాజశేఖర్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవల్సింది ఏముంటుంది. ఆయన ఎప్పటిలాగానే నటనలో  తన సీనియారిటీ చూపించాడు. అయితే ఆడియన్స్ మాత్రం  ఈ పాత్రకు కావల్సిన యాక్టీవ్ నెస్ అతనిలో మిస్ అయినట్టు స్పస్టంగా కనిపిస్తుంది అంటున్నారు.  ఇక ఆయన భార్యగా నటించిన మలయాళ నటి ఆత్మీయ రాజన్ మొదటి సారి తెలుగు సినిమాలో చేసినా.. మలయాళ సినిమా స్కూల్ నుంచి వచ్చింది కనుకు ఆమెలో మైనస్ అంటూ లేదు.  ముస్కాన్ కుబ్చంధాని, అభినవ్ గోమతం, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవివర్మ, శ్రవణ్ రాఘవేంద్ర ఇలా ఎవరికి వారు తమ పరిధిమేకరకు బాగానే నటించారు. 

ఇక సినిమా ఎలా ఉందీ అంటే.. ఇన్వెస్టిగేటివ్ సినిమాలు ఎప్పుడూ బోర్ కొట్టవు. ఈసినిమా  జోజు జార్జ్ అనే  మలయాళ సూపర్‌హిట్ సినిమాకు రీమేక్. ఈ విషయం మూవీ టీమ్ ఎక్కడా చెప్పలేదు కాని.. ఈసినిమా మాలయాళంలో హిట్ అయినంతగా తెలుగు వర్కౌట్ కాలేదనే చెప్పాలి.  ఎందుకంటే ఈమూవీని తెలుగులో రీమేక్ చేసే దశలో.. మన నెటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేయడంతో టీమ్ జాగ్రత్త పాటించలేనట్టు తెలుస్తోంది. అందుకే మూవీలో రోటీన్ సీన్స్ ఎక్కవగా కనిపిస్తున్నాయి. ఇవి ఈ సినిమాకు మైనస్ అంటున్నారు ప్రేక్షకులు. 

శేఖర్ సినిమా ఓపెనింగ్ బాగానే ఉంది అని మరికొంత మంది ఆడియన్స అభిప్రాయం వెల్లడిస్తున్నారు. హీరో ప్రపంచంలోకి వెళ్ళడానికి ఎక్కువ సమయమ తీసుకోకుండా కథ ని చెప్పే ప్రయత్నం చేశారు.. కాని సినిమాలోకి వెళ్లే కొద్ది.. ఆడియన్స్ ను కదలకుండా చేయడంలో.. టీమ్ ఎక్కడో రాంగ్ స్టెప్ వేసినట్టు తెలుస్తోంది. సినిమాలో కొన్ని ట్విస్ట్‌లు మరియు మలుపులు ఉన్నాకూడా కానీ అవి కథలో సరిగ్గా ఇమడలేదు, శేఖర్ పాత్రలో రాజశేఖర్ ఓకే, అతనికి వయసు మనం స్పష్టంగా చూడవచ్చు, పాత్ర రిటైర్డ్ కాప్ అయినప్పటికీ, ఆ పాత్ర దర్యాప్తు చేసేటప్పుడు కొంత ఆక్టివ్ నెస్ కావాల్సి వస్తుంది, కానీ దర్యాప్తు చేసేటప్పుడు అతను శారీరకంగా బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. 

ఇక ఈసినిమాను డైరెక్ట్ చేసిన  జీవిత రాజశేఖర్ గతంలో చాలా సినిమాలు దర్శకత్వం వహించారు. కాని ఈమూవీని మాత్రం మలయాళ మూవీ అంత పర్ఫెక్ట్ గా తెరకెక్కించలేకపోయాని తెలుస్తోంది. టీమ్ అంతా కష్టపడ్డట్టు తెలుస్తోంది. కాని సినిమలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ తీసుకువచ్చారు. సినిమాటోగ్రఫీ మల్లికార్జున్ నారగాని విజ్యువల్స్ పర్వాలేదు అన్నట్టు ఉన్నాయి.  అనూప్  సంగీతం సినిమాకు తగ్గట్టే ఇచ్చాడు. కాని థ్రిల్లర్ మూవీస్ కి సరిపడా స్టఫ్ ఇవ్వలేదు అనేది ప్రేక్షకుల అభిప్రాయం.  

ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే.. శేఖర్ మూవీ అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు అని చెప్పలేము. ముఖ్యంగా థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ఆడియన్స్.. అందులోను రాజశేఖర్ ఫ్యాన్స్ మాత్రం ఒక్క సారి ప్రయత్నించదగ్గ సినిమా ఇది. రాజశేఖర్ కు మళ్ళీ బ్రేక్ ఇవ్వగల సినిమా ఇది అవుతుంది అని మాత్రం చెప్పలేం అంటున్నారు సినిమా చూసిన ఆడియన్స్.  

click me!