సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం ఇదా..? తన పాత లవ్ స్టోరీ ని తలుచుకుంటూ కన్నీళ్లు..!

Published : May 20, 2022, 07:40 AM IST

బుల్లి తెరపై సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే.. చాలా కుర్రాళ్లు హుషారుత్ రెచ్చిపోతుంటారు.. యూత్ ఆడియన్స్ లో ఫుల్ క్రే తెచ్చుకున్న సుధీర్.. రీసెంట్ గా ఓ కార్యక్రమలో ఎమోషనల్ అయ్యాడు. తన బ్రేకప్ లవ్ స్టోరీని తలుచుకుని కనీళ్లు పెట్టాడు. 

PREV
17
సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం ఇదా..? తన పాత లవ్ స్టోరీ ని తలుచుకుంటూ కన్నీళ్లు..!

సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి ప్రతీ సారి.. ప్రతీ ప్రొగ్రామ్ లో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇది ఆ ప్రొగ్రామ్ పై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను పెంచేస్తుంటుంది. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న సుధీర్ పెళ్ళి ఎప్పుడూ చేసుకుంటాడు.. ఎప్పుడు అనౌన్స్ చేస్తాడు అని అంతా ఎదురుచూస్తూనే ఉంటారు. 

27

ఇక రష్మితో ఆన్ స్క్రీన్ రొమాన్స్.. లవ్ ట్రాక్ గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ ఫార్ములా ఆ ప్రొగ్రామ్ సక్సెస్ చేయడం వరకే పరిమితం అని వాళ్ళు చెపుతుంటారు.. ఆడియన్స్ కూడా ఈ విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చారు. అయితే సుధీర్ పెళ్లెప్పుడు అనే టాపిక్ మాత్రం నడుస్తూనే ఉంటుంది. 
 

37

ఈ క్రమలో తన పెళ్ళి , పాత లవ్ స్టోరీల గురించి పలుమార్లు ఓపెన్ అయ్యాడు సుధీర్. రీసెంట్ గా మరోసారి తన లవ్ స్టోరీ గురించి తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రొగ్రాంగ్ కు సంబంధించిన ప్రోమోలో సుధీర్ చుట్టూ సాగిన ఎపిసోడ్ లో సుధీర్ చాలా బాధతో కొన్ని విషయాలు పంచుకున్నాడు. 

47

లవ్ బ్రేకప్ కు సంబంధించిన పెర్ఫామెన్స్ చూసి ఎమోషనల్ అయ్యాడు సుధీర్. అది చూస్తున్నంత సేపు కంటి నిండా నిళ్లు నింపుకుని బాధపడుతూనే ఉన్నాడు. పర్పామెన్స్ తరువాత తన పాత లవ్ స్టోరీని తలుచుకుని.. బాధపడ్డాడు. అందరికి ఒక్క సారిగా సీరియస్ సిచ్చ్యూవేషన్ లోకి తీసుకెళ్లాడు. గెస్ట్ గా ఉన్న ఇంద్రజ కూడా సుధీర్ బాధపడటంతో డల్ అయిపోయారు. 

57

తను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం చెప్పాడుసుధీర్. కుటుంబ బాధ్యతలు,తనకెరీర్ గురించిఏమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంత మంది అభిమానులను పొందడానికి కారణం ఆమె అంటూ.. ఒక రకంగా బ్రేకప్ కూడా తన కెరీర్ ను నిలబెట్టిందన్నట్టు చెప్పాడు సుధీర్. 

67

జీరోగా స్టార్ట్ అయిన సుధీర్ అంచలంచలుగా ఎదుగుతున్నాడు. తను కెరీర్ లో పడ్డ కష్టాలు తలుచుకుంటూనే.. తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి వివరిస్తు ఎమెషనల్ అయ్యాడు సుధీర్. కన్నీళ్లు పెట్టుకున్నాడు.దాంతో సుధీర్ అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యయారు.. సోషల్ మీడియాలో ఆయన్ను ఓదారుస్తూ.. కామెంట్లు పెడుతున్నారు. 
 

77

గతంలో కూడా సుధీర్ కొన్ని సార్లు తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి వివరించాడు. అయితే ఈ ఎమోషనల్ టచ్ తో పాటు సుధీర్ క్రేజ్ తో ప్రోమో రిలీజ్ అవ్వడంతో..  ప్రోగ్రామ్ పై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సుధీర్ ఎం చెప్పాడా అని.. ఎదరుచూస్తున్నారు జనాలు. 

click me!

Recommended Stories