Rajasekhar: బాలయ్య కోసం కెరీర్‌ని రిస్క్ లో పెడుతున్న రాజశేఖర్‌.. లైఫ్‌లో మొదటిసారి డేరింగ్‌ స్టెప్‌

Published : Jun 10, 2026, 11:33 AM IST

Rajasekhar: రాజశేఖర్‌ తన కెరీర్‌లో మొదటిసారి ఒక పెద్ద రిస్క్ చేయబోతున్నాడట. డేరింగ్‌ స్టెప్‌తో ముందుకు వెళ్లబోతున్నాడు. వర్కౌట్‌ అయితే ఓకే, లేదంటే కెరీరే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. 

PREV
15
బాలయ్య కోసం రిస్క్ చేస్తున్న రాజశేఖర్‌

నందమూరి బాలకృష్ణ, రాజశేఖర్‌ కలిసి గతంలో ఓ సినిమాలో నటించాల్సి ఉంది. `జై సింహా` సమయంలో రాజశేఖర్‌ని అడిగారట. కానీ రాజశేఖర్‌ నో చెప్పాడు. మనం ఇద్దరం కలిసి మల్టీస్టారర్‌ చిత్రం చేద్దామని చెప్పాడు రాజశేఖర్‌. దీంతో అప్పట్లో వీరి కాంబో మిస్‌ అయ్యింది. కానీ ఇప్పుడు మళ్లీ సెట్‌ కాబోతుంది. అయితే బాలయ్య కోసం ఇప్పుడు రాజశేఖర్‌ తన కెరీర్‌ని రిస్క్ లో పెట్టబోతుండటం విశేషం. కెరీర్‌ లో మొదటిసారి ఆయనొక డేరింగ్‌ స్టెప్‌ తీసుకుంటున్నాడని సమాచారం.

25
రాజశేఖర్‌ రెండు సినిమాలు డిజప్పాయింట్‌

రాజశేఖర్‌ హీరోగా గత కొంత కాలంగా సక్సెస్‌ అందుకోలేకపోయాడు. దీంతో ఆయన సినిమాలకు గ్యాప్‌ ఇవ్వాల్సి వచ్చింది. దీనికితోడు ఫ్యామిలీ సమస్యలు, ఇతర వివాదాల కారణంగా రాజశేఖర్‌కి గ్యాప్‌ వచ్చింది. మధ్యలో నితిన్‌ హీరోగా వచ్చిన `ఎక్స్ టార్డినరీ మ్యాన్‌` చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. సెకండాఫ్‌లో ఆయనే హీరో. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత మళ్లీ గ్యాప్‌ ఇచ్చి ఇటీవల `బైకర్‌` చిత్రంలో నటించారు. శర్వానంద్‌కి తండ్రి పాత్రలో కనిపించారు. చాలా బలమైన పాత్ర ఆయనది. ఇంకా చెప్పాలంటే ఆయనే ఈ మూవీకి హీరో. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

35
కెరీర్‌లో మొదటిసారి రాజశేఖర్‌ డేరింగ్‌ స్టెప్‌

ఈ క్రమంలో ప్రస్తుతం రాజశేఖర్‌ ఒకటి రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడట. అవి చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కెరీర్‌లో మొదటిసారి డేరింగ్‌ స్టెప్‌ వేయబోతున్నాడట. విలన్‌గా మారబోతున్నాడట. కెరీర్‌ బిగినింగ్‌లో ఒకటి రెండు సినిమాల్లో నెగటివ్‌ రోల్స్ చేశాడు రాజశేఖర్‌. ఇప్పుడు మళ్లీ విలన్‌ రోల్‌ చేయడానికి రెడీ అయ్యాడట. అది కూడా బాలయ్యతో విలన్‌ రోల్‌ కావడం విశేషం. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.

45
కొరటాలతో సినిమా చేయబోతున్న బాలకృష్ణ

బాలయ్య ప్రస్తుతం గోపీచంద్‌ మలినేనితో `ఎన్బీకే 111` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి నేడు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు సాయంత్రం టైటిల్‌ గ్లింప్స్ రాబోతుంది. దీంతోపాటు బాలయ్య నెక్ట్స్ మూవీకి సంబంధించిన ప్రకటన కూడా రాబోతుందట. కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ మూవీ చేయబోతున్నారు. కొరటాల మార్క్ సందేశం, సామాజిక అంశాలు, బాలయ్య మార్క్ మాస్‌ ఎలిమెంట్లని జోడించి ఈ సినిమాని తీయాలని భావిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఒక అదిరిపోయే న్యూస్‌ వినిపిస్తోంది.

55
బాలయ్య కోసం విలన్‌గా రాజశేఖర్‌

ఇందులో విలన్‌గా రాజశేఖర్‌ కనిపించబోతున్నాడట. ఆల్మోస్ట్ ఇది కన్ఫమ్‌ అంటున్నారు.  రొటీన్‌ విలన్‌ పాత్రకి భిన్నంగా రాజశేఖర్‌ రోల్‌ ఉంటుందట. అది మైండ్‌ గేమ్‌తో సాగుతుందట. హీరో పాత్రకి సమానంగా ఈ రోల్‌ ఉంటుందని సమాచారం. దీనికి `కార్పెంటర్‌` అనే టైటిల్ని అనుకుంటున్నారట. పక్కా కమర్షియల్‌గా దీన్ని ప్లాన్‌ చేస్తున్నారని, మాఫియా బ్యాక్‌ గ్రౌండ్‌లో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉంటుందట. అధికారానికి ఉద్దేశం తోడైతే అది ఉద్యమంగా మారుతుందనే కొటేషన్‌తో సినిమా నడుస్తుందని టాక్‌. పొలిటికల్‌, సోషల్‌ టచ్‌తో సినిమా రన్‌ అవుతుందని, దీనికి అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తారని అంటున్నారు. జులైలో ఓపెనింగ్‌ జరుపుకొని ఆగస్ట్ లో షూటింగ్‌ స్టార్ట్ చేసే ఆలోచనలో టీమ్‌ ఉన్నట్టు సమాచారం. ఇటీవల బాలయ్య సినిమాలకు థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి మాత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ని మారుస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా హిట్‌ అయితే విలన్‌గా రాజశేఖర్‌ బిజీ అయిపోతాడని చెప్పొచ్చు. తేడా కొడితే ఆయన కెరీర్‌ మరింత ప్రశ్నార్థకంగా మారే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా రాజశేఖర్‌ పెద్ద రిస్కే చేస్తున్నారని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories