చిరంజీవి చేయాల్సిన మూవీతో రాజశేఖర్ సూపర్ హిట్ అందుకున్నారు. అయితే ఈ చిత్రం కావాలనే మెగాస్టార్ వదులుకున్నారు. రాజశేఖర్ చేయాలని సలహా ఇచ్చారట. మరి ఏం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి, యాంగ్రియంగ్ మేన్ రాజశేఖర్ ఒకప్పుడు హీరోలుగా పోటీ పడ్డారు. నువ్వా నేనా అనేట్టు సినిమాలు చేశారు. రాజశేఖర్ మరో మెగాస్టార్ అనే పరిస్థితి ఉండేది. కానీ రాజశేఖర్ సరైన ప్లానింగ్‌తో సినిమాలు చేయకపోవడం వల్ల ఫెయిల్యూర్స్ చవిచూడాల్సి వచ్చింది. చిరంజీవికి బ్యాక్ ఎండ్‌లో అల్లు అరవింద్ ఉండి, ప్లాన్ చేయడం వల్ల, వరుసగా బ్లాక్ బస్టర్స్ పడ్డాయని, కానీ రాజశేఖర్ కి అలాంటి వ్యక్తులు లేకపోవడంతో ఆయన కెరీర్ ఎత్తపల్లాలతో సాగిందని చెబుతుంటారు.
24
చిరు, రాజశేఖర్ మధ్య గొడవలు
అయితే గత కొంత కాలంగా చిరంజీవికి, రాజశేఖర్ కి పడటం లేదు. చిరంజీవిపై, ఆయన చేసిన సేవా కార్యక్రమాలపై రాజశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం, పలు ఆరోపణలు చేయడంతో ఆ గ్యాప్ ఏర్పడింది. రాజకీయ పరంగానూ విభేదాలు చోటు చేసుకున్నాయి. చిరు అభిమానులు రాజశేఖర్‌పై దాడి కూడా చేశారు. దీంతో ఇద్దరి మధ్య పెద్ద స్థాయిలో గొడవలు జరిగాయని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అన్నీ సెట్ అయ్యాయి. చిరు అవన్నీ పట్టించుకోవడం లేదు. రాజశేఖర్ కూడా అన్నీ వదిలేసి ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేశారు.
34
న్యాయం కావాలి మూవీ చిరంజీవి చేయాల్సింది
అయితే రాజశేఖర్ చేయాల్సిన పలు సినిమాలు చిరంజీవి చేసి బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు. అలా కొట్టిందే `ఠాగూర్`. ఇది మొదట రాజశేఖర్ వద్దకే వచ్చింది. కానీ ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు. చిరంజీవి చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. కానీ కెరీర్ బిగినింగ్ లో మాత్రం రాజశేఖర్‌కి హిట్ ఇచ్చారు చిరంజీవి. తాను చేయాల్సిన మూవీని రాజశేఖర్‌తో చేయించారు. అదే `న్యాయంకోసం`. 1988లో వచ్చిన చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకుడు. సీత ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మలయాళంలో మమ్ముట్టి నటించిన `సీబీఐ ధైర్యక్కురిప్పు` కి రీమేక్. చిరంజీవితో ఈ సినిమాని తెలుగులో చేయాలని అల్లు అరవింద్ ఈ రీమేక్ రైట్స్ తీసుకున్నారు. సినిమా చూశాక.. ఇది తనకంటే రాజశేఖర్‌కి బాగా సెట్ అవుతుందని చిరంజీవి చెప్పారు. ఈ రైట్స్ వారికే ఇచ్చారు. ఈ సినిమా చేయాలని రాజశేఖర్‌కి సలహా ఇచ్చారట చిరంజీవి. దీంతో రాజశేఖర్ ఈ మూవీ చేసి పెద్ద హిట్ కొట్టాడు. అప్పట్లో ఇదొక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. దాదాపు మూడు వారాలపాటు హౌజ్‌ఫుల్‌తో రన్ అయ్యిందట. అంతేకాదు సినిమా థియేటర్లో క్లోజ్ అయిన తర్వాత కొంత గ్యాప్‌తో మళ్లీ రిలీజ్ చేస్తే అన్నీ షోస్ హౌజ్ ఫుల్ అయ్యాయట. అంతగా ఆడిందట.
మరి ఈ సినిమాని చిరంజీవి ఎందుకు వదులుకున్నాడనేది చూస్తే, ఇందులో హీరో గంట తర్వాత ఎంట్రీ ఇస్తాడు. పైగా తన మార్క్ మాస్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్లు పెద్దగా లేవు. అప్పట్లో చిరంజీవిని డాన్సులు, పాటలు, ఫైట్స్ ఇలా కమర్షియల్ ఎలిమెంట్లతో ఇష్టపడేవారు. దీంతో తాను చేస్తే ఇది పెద్దగా ఆడదని భావించిన చిరంజీవి.. రాజశేఖర్ కి అయితే బాగా సెట్ అవుతుందని చెప్పారట. అన్నట్టుగానే రాజశేఖర్ చేసి పెద్ద హిట్ కొట్టారు. అప్పటికే ఆయన `ఆహుతి`, `శ్రుతిలయలు`, `ఆరాధన` వంటి చిత్రాల్లో నటించి విజయాలు అందుకున్నారు. మంచి ఫామ్‌లో ఉన్నారు రాజశేఖర్. ఆ టైమ్‌లో వచ్చిన `న్యాయంకోసం` కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని ప్రముఖ జర్నలిస్ట్, రైటర్ శ్రీకాంత్ వెల్లడించారు.