తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. కానీ రాజకీయాల కారణంగా వీరి మధ్య విభేదాలు వచ్చాయి. ఒకప్పుడు అలీ లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా ఉండేది కాదు. అంతలా వీరిద్దరి మధ్య బాండింగ్ ఉండేది. ఖుషి, జల్సా, అత్తారింటికి దారేది లాంటి చిత్రాల్లో పవన్, అలీ కామెడీ సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత అలీ వైసీపీ పార్టీలో చేరారు. అప్పటి నుంచి పవన్, అలీ మధ్య విభేదాలు మొదలయ్యాయి.
DID YOU KNOW ?
పవన్ మమ్మల్ని పట్టించుకోలేదు
ఒకసారి చిరంజీవి ఇంటికి డిన్నర్ కి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కనీస మర్యాద లేకుండా ప్రవర్తించినట్లు రాజశేఖర్ తెలిపారు. నేను, జీవిత వస్తున్నాం అని తెలిసి తమని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అని తెలిపారు.
25
రాజశేఖర్ తో అలీకి అనుబంధం
ఇటీవల పవన్ కళ్యాణ్ చిత్రాల్లో అలీ నటించలేదు. ఓ ఇంటర్వ్యూలో సీనియర్ హీరో రాజశేఖర్ పవన్ కళ్యాణ్, అలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలీ పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు తనకి కూడా మంచి సన్నిహితుడు అని రాజశేఖర్ అన్నారు. అలీతో నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది. పవన్ కళ్యాణ్ గురించి నేను ఒకసారి మాట్లాడాను. దానికి రివేంజ్ గా ఆయన గబ్బర్ సింగ్ చిత్రంలో నన్ను ఇమిటేట్ చేస్తూ అంత్యాక్షరి సీన్ పెట్టారు.
35
పవన్ కళ్యాణ్ కి అలీ చెప్పి ఉండాల్సింది
అలీ పవన్ కళ్యాణ్ కి వద్దు అని చెప్పి ఉండాల్సింది. రాజశేఖర్ ని ఇమిటేట్ చేయవద్దు.. నాకు కూడా సన్నిహితుడు ఆయన అని. కానీ అలీ పవన్ కళ్యాణ్ కి చెప్పలేదు. ఆ విషయంలో నేను చాలా ఫీల్ అయ్యా. అలీని అడుగుదాం అనుకున్నా. కానీ ఎందుకులే అని సైలెంట్ అయిపోయినట్లు రాజశేఖర్ తెలిపారు.
రాజశేఖర్ ని అవాయిడ్ చేయండి అని అలీ పవన్ కి చెప్పి ఉండాల్సింది. ఆ విషయంలో మాత్రం తనకి బాధ ఉందని రాజశేఖర్ తెలిపారు. ఆ విధంగా పవన్, రాజశేఖర్ వివాదంలో అలీ కార్నర్ అయ్యారు.
55
పవన్ పై రాజశేఖర్ కామెంట్స్
తాను జీవిత ఒకసారి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడే ఉండి కూడా తమని పట్టించుకోలేదని రాజశేఖర్ తెలిపారు. తమతో మాట్లాడకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారని రాజశేఖర్, జీవిత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాజశేఖర్ కి, మెగా ఫ్యామిలీకి మధ్య వివాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి.