ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్, మెగా ఫ్యామిలీతో దూరపు బంధుత్వం..అయినా చిరంజీవిలో అది నచ్చదు, స్టార్ హీరో కామెంట్స్

First Published | Aug 8, 2024, 10:19 AM IST

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో అజాతశత్రువు అని అంటుంటారు. అయినప్పటికీ చిరంజీవిని వ్యతిరేకించేవాళ్ళు, విభేదించేవాళ్ళు ఉన్నారు. నందమూరి, మెగా ఫ్యామిలీ మధ్య రైవల్రీ ఎప్పుడూ ఉండేదే. చిరంజీవిపై అప్పుడప్పుడూ విమర్శలు చేసే హీరోలు కూడా ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో అజాతశత్రువు అని అంటుంటారు. అయినప్పటికీ చిరంజీవిని వ్యతిరేకించేవాళ్ళు, విభేదించేవాళ్ళు ఉన్నారు. నందమూరి, మెగా ఫ్యామిలీ మధ్య రైవల్రీ ఎప్పుడూ ఉండేదే. చిరంజీవిపై అప్పుడప్పుడూ విమర్శలు చేసే హీరోలు కూడా ఉన్నారు. మంచు ఫ్యామిలీ, రాజశేఖర్ నుంచి చిరంజీవికి అప్పుడప్పుడూ విమర్శలు ఎదురవుతుంటాయి. 

ముఖ్యంగా రాజశేఖర్ చిరంజీవిని పలు సందర్భాల్లో తీవ్రంగా వ్యతిరేకించడం విమర్శించడం చూశాం. ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజశేఖర్ చిరంజీవిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. చిరంజీవి ఫ్యాన్స్ రాజశేఖర్ కారుని అటాక్ చేయడం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికి తెలుసు. అయితే చిరంజీవిని తాను అంతగా వ్యతిరేకించడానికి కారణం ఏంటో రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 


చిరంజీవి అంటే ఒక విషయంలో నాకు నచ్చదు. చిరంజీవి మాత్రమే కాదు.. ఎవరైనా సరే.. నేను గొప్ప అని ఫోజు కొడితే నాకు నచ్చదు. పక్కనే ఉన్న జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. వీళ్ళిద్దరూ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు. చిరంజీవితో మాకు రిలేషన్ చాలా బావుండేది. అదే విధంగా జీవిత ఒక షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. మెగా ఫ్యామిలీతో తనకి రిలేషన్ ఉందని కూడా తెలిపారు. 

నా తరుపున కుటుంబ సభ్యులు.. అల్లు అరవింద్ గారి కుటుంబ సభ్యులకు దూరపు బంధుత్వం ఉందని జీవిత రివీల్ చేసింది. రాజశేఖర్ గారు న్యాయం కోసం చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేసారు అని కూడా జీవిత గుర్తు చేసుకుంది. మా మధ్య అంత బాగా రిలేషన్ ఉండేది అని అన్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ మెగా ఫ్యామిలిలో మార్పు కనిపించింది. మేము చాలా పెద్ద, గొప్ప అనే ఫీలింగ్ వారిలో కనిపించింది. 

నేను మెగాస్టార్ ని.. కాబట్టి అందరూ నా వెనుకే ఉండాలి అన్నట్లుగా చిరంజీవి గారు బిహేవ్ చేశారు. దానికి మేము సిద్ధం కాదు. ఆ తర్వాత తమిళ చిత్రం రమణ రీమేక్ ఠాగూర్ విషయంలో కూడా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ బిహేవియర్ కూడా అలాగే ఉంటుందని జీవిత రాజశేఖర్ అన్నారు. 

అంతే కాదు మెగా ఫ్యామిలీ రాజశేఖర్ గారిపై హీరోయిన్లలో కూడా నెగిటివిటీ పెంచేలా దుష్ప్రచారం చేసినట్లు జీవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు రాజశేఖర్ గారితో నటించకండి అని నెగిటివ్ గా చెప్పేవారు. ఆ హీరోయిన్లు పీక్ లో ఉన్నప్పుడు అడిగితే డేట్స్ లేవని చెప్పేవాళ్ళు. కొంచెం డౌన్ అయ్యాక ఒకే చెప్పేవాళ్ళు. అప్పుడు రాజశేఖర్ గారి మంచితనం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మీరు ఇంత మంచిగా ఉంటున్నారు.. బయట ఎందుకు మీ గురించి అలా మాట్లాడుతున్నారు అని ఆ హీరోయిన్లే తమకి చెప్పినట్లు జీవిత పేర్కొన్నారు. 

Latest Videos

click me!