బ్యాక్ పాకెట్ లో చేయి పెట్టి డ్యాన్స్, రొమాన్స్..అదే ఇష్టం అంటూ బోల్డ్ గా, సుతిమెత్తగా హీరోయిన్ కౌంటర్

First Published | Aug 8, 2024, 8:57 AM IST

మాస్ మహారాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ హంగామా సోషల్ మీడియాలో గట్టిగానే ఉంది. డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రమోషన్ స్ట్రాటజీలు బాగా వర్కౌట్ అవుతున్నాయి. హరీష్ శంకర్ అగ్రెసివ్ గా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు.

మాస్ మహారాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ హంగామా సోషల్ మీడియాలో గట్టిగానే ఉంది. డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రమోషన్ స్ట్రాటజీలు బాగా వర్కౌట్ అవుతున్నాయి. హరీష్ శంకర్ అగ్రెసివ్ గా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మరోవైపు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కుర్రాళ్ళని ఫిదా చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

భాగ్యశ్రీ గ్లామర్, ఆమె యాటిట్యూడ్, క్యూట్ అండ్ హాట్ లుక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో సితార్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఆ పాటలో రవితేజ, భాగ్యశ్రీ రొమాన్స్.. డ్యాన్స్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. మీడియా కూడా ఆ డ్యాన్స్ గురించి ప్రశ్నించింది. 


భాగ్యశ్రీ వేసుకున్న డ్రెస్ బ్యాక్ పాకెట్ లో రవితేజ చేయి పెట్టి వేసే స్టెప్పుపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక రకంగా మిస్టర్ బచ్చన్ మూవీ ప్రచారానికి ఈ వివాదం బాగా ఉపయోగపడింది. హరీష్ శంకర్ ట్రోలింగ్ కి ఎలాగు ధీటుగా బదులిస్తారు. ఇప్పుడు హీరోయిన్ భాగ్యశ్రీ కూడా రెచ్చిపోతోంది. 

చూడడనికి క్యూట్ గా కనిపిస్తున్న భాగ్యశ్రీ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పరోక్షంగా దిమ్మతిరిగే కౌంటర్ వేసింది. రవితేజతో నటిస్తున్నప్పుడు డ్యాన్స్ చేయడం, రొమాన్స్ చేయడంలో ఏది కష్టంగా అనిపించింది అని మీడియా అడిగారు. నాకేమి కష్టంగా అనిపించలేదు అని భాగ్యశ్రీ తెలిపింది. 

రవితేజతో డ్యాన్స్ చేయడం ఇష్టమా, రొమాన్స్ చేయడం ఇష్టమా అని మరో ప్రశ్న అడిగారు.. దీనికి భాగ్యశ్రీ బదులిస్తూ నన్నడిగితే రెండూ ఇష్టమే అని చెబుతా. ఆయనతో డ్యాన్స్, రొమాన్స్ చేయడం నాకు ఇష్టం అని సూటిగా బదులిచ్చింది. నెటిజన్లు ఆమె సమాధానాన్ని వైరల్ చేస్తూ.. ట్రోలర్స్ కి సుతిమెత్తగా కౌంటర్ వేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Latest Videos

click me!