రజినీకాంత్ ‘కూలీ’రిలీజ్ డేట్‌ మారింది, ఆ పండక్కే

Published : Jan 29, 2025, 10:07 AM IST

బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఓ స్టోరీని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు లోకేశ్ కనగరాజ్. రజనీ- లోకేశ్ కాంబోలో రానున్న తొలి సినిమా కావడం వల్ల అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

PREV
13
రజినీకాంత్ ‘కూలీ’రిలీజ్ డేట్‌ మారింది, ఆ పండక్కే
Lokesh Kanagaraj Rajinikanths Coolie film update out

జైలర్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఆయన వరుస సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయారు. రీసెంట్ గా వెట్టైయాన్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చారు. టీజీ జ్ఞానలేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద జస్ట్ ఓకే అనిపించుకుంది.

ఇక ఇప్పుడు  రజినీకాంత్ ‘కూలీ’ సినిమా పైనే అందరి దృష్టీ ఉంది.  తమిళంలో  సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరొందిన లోకేశ్ కనగరాజ్ ఈ కూలీ మూవీకి దర్శకత్వం వహిస్తువివీకప. బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే సినిమానే ఈ కూలీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానలు ఎదురుచూస్తున్నారు.
 

23
coolie


 కూలీ సినిమా టైటిల్‌కి తగినట్లుగా కార్మికుల దినోత్సవమైన మే 1 (మే డే) రోజున సెంటిమెంట్‌గా రిలీజ్ చేయాలని తొలుత వార్తలు వచ్చాయి. కానీ..  ఇప్పుడు రిలీజ్ డేట్ మారిందని తెలుస్తోంది. ఈ సినిమాని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూ బాగా టైమ్ పట్టేటట్లు ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారట.   పండగ సీజన్ లో అయితే కలెక్షన్లు కూడా బాగా వస్తాయని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.

బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఓ స్టోరీని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు లోకేశ్ కనగరాజ్. రజనీ- లోకేశ్ కాంబోలో రానున్న తొలి సినిమా కావడం వల్ల అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

33
Coolie Movie

 
రజనీ అనారోగ్యంతో పాటు ఇతర కారణాల వల్ల కాసేపు బ్రేక్ పడగా, మళ్లీ ఇప్పుడు చిత్రీకరణ వేగం పుంజుకుంటోంది.  కూలీ సినిమాలో రజినీకాంత్ గోల్డ్ స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్లు తమిళ వర్గాలు చెప్తున్నాయి.

ఈ మూవీలోనే అక్కినేని నాగార్జున, సత్యరాజ్, మంజుమ్మెల్‌ బాయ్స్ ఫేమ్ సౌబిన్‌ షాహిర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.   సూపర్ స్టార్‌కి వరుసగా మ్యూజికల్ హిట్స్ ఇస్తున్న అనిరుధ్ రవిచందర్ ఈ కూలీ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
 

click me!

Recommended Stories