దరిద్రంగా ఉంది, సగం షూటింగ్ పూర్తయ్యాక మూవీ ఆపేద్దాం అనుకున్న రాజమౌళి.. కట్ చేస్తే దిమ్మతిరిగే బ్లాక్ బస్టర్

Published : Apr 25, 2025, 07:56 PM IST

ఎంత కష్టమైనా రాజమౌళి వెనకడుగు వేసిన సందర్భాలు లేవు. కానీ రాజమౌళి ఒక చిత్రాన్ని మధ్యలోనే ఆపేద్దాం అనుకున్నారట. అది కూడా సగం షూటింగ్ పూర్తయ్యాక. 

PREV
15
దరిద్రంగా ఉంది, సగం షూటింగ్ పూర్తయ్యాక మూవీ ఆపేద్దాం అనుకున్న రాజమౌళి.. కట్ చేస్తే దిమ్మతిరిగే బ్లాక్ బస్టర్
Rajamouli

దర్శక ధీరుడు రాజమౌళికి ఇంతవరకు ఒక్క పరాజయం కూడా లేదు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. రాజమౌళి తన ప్రతి చిత్రంతో ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలో జక్కన్నకి అనేక ఛాలెంజ్ లు ఎదురవుతుంటాయి. వాటిని అధికమించి ముందుకు వెళ్ళాలి. 

25

ఎంత కష్టమైనా రాజమౌళి వెనకడుగు వేసిన సందర్భాలు లేవు. కానీ రాజమౌళి ఒక చిత్రాన్ని మధ్యలోనే ఆపేద్దాం అనుకున్నారట. అది కూడా సగం షూటింగ్ పూర్తయ్యాక. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఇంతకీ రాజమౌళి మధ్యలోనే ఆపేద్దాం అనుకున్న మూవీ ఏంటంటే.. ఈగ. అవును జక్కన్న ఈగ చిత్రాన్ని 50 శాతం షూటింగ్ పూర్తయ్యాక ఆపేద్దాం అనుకున్నారట. 

 

35

ఆ మూవీలో ఈగనే హీరో. ఈగని గ్రాఫిక్స్ లో చూపిస్తారు. అంటే షూటింగ్ లో నటీనటులంతా తమ ముందు ఈగ ఉన్నట్లు ఊహించుకుని నటించాలి. ఆ విధంగా రాజమౌళి 50 శాతం షూటింగ్ పూర్తి చేశారు. షూటింగ్ పూర్తి చేసిన ఫుటేజ్ కి విజువల్ ఎఫెక్ట్స్ లో ఈగని యాడ్ చేయాలి. విజువల్ ఎఫెక్ట్స్ చేసే వాళ్ళు కొన్ని సీన్లలో ఈగని క్రియేట్ చేసి చూపించారు. ఆ సీన్లు చూశాక నా గుండె జారిపోయింది. 

45

వాళ్ళు క్రియేట్ చేసిన ఈగ పరమ దరిద్రంగా ఉంది. దాని మూమెంట్స్ కూడా ఏదో రోబోటిక్ లాగా, ఆర్టిఫీషియల్ గా ఉన్నాయి. చిన్న పిల్లాడికి చూపించినా ఇది నిజం ఈగ కాదు అని చెప్పేస్తాడు. నాకు ఏమాత్రం నచ్చలేదు. ఇటు చూస్తే సగం మూవీ పూర్తయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే 10 కోట్లు బడ్జెట్ అయిపోయింది. ఈ మూవీ వర్కౌట్ కాదు.. ఇక్కడితో ఆపేద్దాం అనుకున్నా. బడ్జెట్ కోటి రూపాయల వరకు అయి ఉంటే ఖచ్చితంగా ఆపేసేవాడిని.  

55

కానీ 10 కోట్లు దాటిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మళ్లీ కూర్చుని ఈగని డిజైన్ చేసి ఇచ్చాం. దాని కోసం నిజంగా ఈగల్ని పట్టుకుని వాటిని ఫ్రిజ్ లో పెట్టి గమనించాం. ఆ విధంగా ఈగని డిజైన్ చేసి సిజి వర్క్ చేసే సంస్థకి ఇచ్చినట్లు రాజమౌళి తెలిపారు. దాని ప్రకారం ఈగ సీజీ వర్క్ చేశారు. అప్పుడు ఈగ రియలిస్టిక్ గా బాగా వచ్చింది అని రాజమౌళి తెలిపారు. ఈగ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో నాని, సమంత జంటగా నటించారు. నాని మరణించి ఈగగా మారి విలన్ పై ప్రతీకారం తీర్చుకోవడం ఈ చిత్ర కథ. 

Read more Photos on
click me!

Recommended Stories