సంచలనాలకు తెరలేపిన రాజమౌళి.. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, చరణ్‌, రవితేజ, రానాలతో `ఆర్‌ఆర్‌ఆర్‌` ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌ ?

Published : Jul 21, 2021, 08:35 PM IST

దర్శకధీరుడు రాజమౌళి సంచలనాలకు తెరలేపుతున్నారు. తాను రూపొందిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాపై హైప్స్ నీ పీక్‌లోకి తీసుకెళ్లబోతున్నారు. అందుకు ఐదుగురు స్టార్లతో ఓ ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌ని ప్లాన్‌ చేశారని తెలుస్తుంది.   

PREV
17
సంచలనాలకు తెరలేపిన రాజమౌళి.. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, చరణ్‌, రవితేజ, రానాలతో `ఆర్‌ఆర్‌ఆర్‌` ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌ ?
రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాని రూపొందిస్తున్నారు. ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో ఇది ఒకటి. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్‌ యంగర్‌ ఏజ్‌ లో ఏం చేశారనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

27
ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల ఫస్ట్ లుక్‌ లు, మేకింగ్‌ వీడియోలు విశేషంగా ఆదరణ పొందాయి. రికార్డ్‌ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఇటీవల విడుదలైన మేకింగ్‌ వీడియో సైతం రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతుంది.

37
ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలను మరింత పీక్‌లోకి తీసుకెళ్తున్నారు రాజమౌళి. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ స్పెషల్‌ ఫ్రెండ్‌షిప్‌ ప్రమోషనల్‌ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారట. దాదాపు రూ6.5కోట్లతో ఈ స్పెషల్‌ సెట్‌ని నిర్మించారని ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతుందని సమాచారం.

rrr

47
అంతేకాదు ఇందులో ఐదుగురు బిగ్‌ స్టార్స్ కనిపించబోతుండటం విశేషం. తాను సినిమాలు తీసిన ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రవితేజ, రానాలతో ఈ ప్రమోషనల్‌ ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌ని డిజైన్‌ చేశారట జక్కన్న. దీన్ని ఆగస్ట్ 1న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది.

57
ఈ పాట నెవర్‌ బిఫోర్‌, ఎవర్‌ ఆఫ్టర్‌ అనేలా ఉంటుందని టాలీవుడ్‌ సర్కిల్‌లో వార్త చక్కర్లు కొడుతుంది. అంతేకాదు `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రమోషనల్‌ సాంగ్ గా దీన్ని వాడుకోబోతున్నారట రాజమౌళి. ఈ పాటతోనే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. వెయ్యి కోట్ల బాక్సాఫీస్‌ టార్గెట్‌గా రాజమౌళి ముందుకు సాగుతున్నారని, జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్‌.

67
ఇక అలియాభట్‌, ఒలివీయా మోర్రీస్‌, అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 13న ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

77
ఇదిలా ఉంటే ఈ ఐదుగురు స్టార్లతో రాజమౌళి సినిమాలు చేశారు. ప్రభాస్‌తో `చత్రపతి`, `బాహుబలి` చేయగా, రానాతో `బాహుబలి` అలాగే ఎన్టీఆర్‌తో `స్టూడెంట్‌ నెం 1`,`సింహాద్రి`, `యమదొంగ` ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌` చేస్తున్నారు. రామ్‌చరణ్‌తో `మగధీర` ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌` చేస్తున్నారు. అలాగే రవితేజతో `విక్రమార్కుడు` సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలన్నీ టాలీవుడ్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసిన చిత్రాలే కావడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories