`వకీల్‌సాబ్‌` సూపర్‌ ఉమెన్‌కి లైఫ్‌ ఇచ్చిన పవన్‌.. ఏకంగా `జబర్దస్త్`లో రచ్చ షురూ

Published : Jul 21, 2021, 07:34 PM IST

`వకీల్‌సాబ్‌`లోని ఇన్‌స్పెక్టర్‌ సూపర్‌ ఉమెన్‌కి విపరీతమైన క్రేజ్‌ని తీసుకొచ్చారు పవన్‌. ఈ సినిమాతో ఇప్పుడీ సూపర్‌ ఉమెన్‌ లైఫ్‌ టర్న్‌ అయ్యింది. వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. తాజాగా `జబర్దస్త్`లో రచ్చ షురూ చేసింది. 

PREV
18
`వకీల్‌సాబ్‌` సూపర్‌ ఉమెన్‌కి లైఫ్‌ ఇచ్చిన పవన్‌.. ఏకంగా `జబర్దస్త్`లో రచ్చ షురూ
పవన్‌ నటించిన `వకీల్‌సాబ్‌` చిత్రంలోని కోర్ట్ సీన్‌లో ఇన్‌స్పెక్టర్‌ సరళాదేవిని పవన్‌ సూపర్‌ ఉమెన్‌గా వర్ణించిన విధానం, ఆయా సన్నివేశాలు ఎంతగా హైలైట్‌ అయ్యాయో తెలిసిందే. జెట్‌ స్పీడ్‌లో వచ్చానని ఆమె చెప్పడం, అల్వాల్‌ నుంచి మోయినాబాద్‌ కి సిర్ప్ పన్‌ద్రా మినిట్‌లో వచ్చారా అనడం ఆకట్టుకుంది. ఇది సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

28
ఈ సినిమాతో సరళాదేవి పాత్రలో నటించిన లిరిష కి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. బాగా పాపులర్‌ అయ్యింది. ఆ సినిమా తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు, సినిమా అవకాశాలు, షోస్‌లతో బిజీ బిజీగా గడుపుతోంది. ఓవర్‌నైట్‌లో పాపులర్‌ అయి అందరికి ఆకట్టుకుంటుంది.

38
ఓ రకంగా చెప్పాలంటే కేవలం పది నిమిషాల సీన్‌తో ఆమెని లైఫ్‌ ఇచ్చాడు పవన్‌. దీంతో ఇప్పుడే ఏకంగా `జబర్దస్త్`లోకి ఎంట్రీ ఇచ్చింది లిరిష. రాకెట్‌ రాఘవ టీమ్‌లో ఆమె పోలీస్‌గానే కనిపించారు.

48
ఇందులో ఆమె ఎంట్రీ అదిరిపోయేలా ఉండటం విశేషం. అంతగా స్పెషల్‌ ఎఫెక్ట్స్ తో హైలైట్‌ చేసింది మల్లెమాల టీమ్‌. దీంతోనూ పోలీసుగా ఆమె సందడి చేశారు. అదే స్థాయిలో రచ్చ రచ్చ చేశారు.

58
తనని తక్కువ చేసి మాట్లాడారని తప్పు చేసిన వారికి చితక్కొట్టుడు కొట్టింది లిరిష. వీరి స్కిట్‌లో ఈమె ఎంట్రీ, ఆమె సన్నివేశాలు హైలైట్‌ కావడమే కాదు, టోటల్‌ షోలోనూ ఆ స్కిట్‌ హైలైట్‌గా కావడం విశేషం.

68
లిరిష విషయానికి వస్తే ఆమె సీరియల్స్, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తుంది. సీరియల్స్ లో పలు విలన్‌ రోల్స్ చేసింది. ఎక్కడా గుర్తింపు రాలేదు. కానీ పవన్‌ జస్ట్ ఓ చిన్న సీన్‌లో ఆమెని స్టార్ ని చేసేశాడు. దీంతో తన ఆనందానికి అవధుల్లేవంటోంది లిరిష. పలు ఇంటర్వ్యూలో పవన్‌కి ధన్యవాదాలు తెలియజేసింది.

78
అయితే సూపర్‌ ఉమెన్‌ సన్నివేశాల్లో పవన్‌ చెప్పే డైలాగులు ఒరిజినల్‌లో లేవట. సూపర్ ఉమెన్ అంటూ కోర్టులో పవన్‌ ప్రశ్నించిన ఆ సన్నివేశాలు నిజానికి ఒరిజినల్ స్క్రిప్టులో లేవట. అక్కడ సూపర్ ఉమెన్ అనే డైలాగ్ లేదు. కానీ పవన్ ఇంకా ఏదో కావాలని.. ఆ సీన్‌లో డైలాగ్ యాడ్ చేసారని చెప్పింది లిరిష. ఆ క్రెడిట్‌ మొత్తం పవన్‌దే అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

88
పవన్ కంటే ముందు చిరంజీవితో నటించింది లిరిష. 15 ఏళ్ల కింద వచ్చిన `స్టాలిన్` సినిమాలో సునీల్‌ను పెళ్లి చేసుకునే అమ్మాయి పాత్రలో నటించింది ఈమె. ఆ తర్వాత చాలా సినిమాలు, సీరియల్స్ చేసినా కూడా రాని గుర్తింపు ఒక్క సూపర్ ఉమెన్ పాత్రతో వచ్చేసింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories