జబర్దస్త్ వర్షకి సిగరేట్లతో కాల్చుకునే అలవాటు ఉందా? అర్థరాత్రి పైట తీసి కాల్చమంటూ ఒత్తిడి.. అంతా షాక్‌..

Published : Jul 17, 2024, 07:41 PM IST

జబర్దస్త్ వర్ష.. అందరికి షాకిచ్చింది. బాడీపై సిగరేట్లతో కాల్చుకుంటూ ఆమె చేసిన పని అందరిని ఆశ్చర్యపరిచింది. లేడీ కమెడియన్‌లో ఈ యాంగిల్ చూసి అంతా షాక్‌ అవుతున్నారు.   

PREV
16
జబర్దస్త్ వర్షకి సిగరేట్లతో కాల్చుకునే అలవాటు ఉందా? అర్థరాత్రి పైట తీసి కాల్చమంటూ ఒత్తిడి.. అంతా షాక్‌..
photo- jabardasth promo

జబర్దస్త్ వర్ష.. జబర్దస్త్ కామెడీ షోలో అత్యంత ఫాలోయింగ్‌, క్రేజ్‌ ఉన్న లేడీ కమెడియన్‌. అందం ఆమెకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌. దీనికితోడు ఇమ్మాన్యుయెల్ టీమ్‌లో ఆమె చేసే రచ్చ బాగా హైలైట్‌ అవుతుంది. ఓవైపు అందంతో ఆకట్టుకుంటూనే, అభినయంతో అలరిస్తుంది. కామెడీ పండిస్తూ నవ్వులు పూయిస్తుంది. ఇలా వర్ష, ఇమ్మాన్యుయెల్‌ స్కిట్లల్లో  ఫుల్‌ మీల్స్ ఉంటాయని చెప్పొచ్చు.
 

26
photo- jabardasth promo

ప్రస్తుతం జబర్దస్త్ షో ఒక్కటే ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. చాలా మంది కమెడియన్లని పక్కన పెట్టారు. బాగా కామెడీ చేసేవాళ్లతో స్కిట్లు చేయిస్తున్నారు. కొందరిని టీమ్‌లలో అడ్జెస్ట్ చేశారు. ఇక ఇమ్మాన్యుయెల్‌, జబర్దస్త్ వర్షల టీమ్‌ కొనసాగుతుంది. ఇందులో రియాజ్‌ కూడా ఉన్నాడు. తనదైన కామెడీతో రాణిస్తున్నాడు. తాజాగా జబర్దస్త్ వర్ష చేసిన పని ఇప్పుడు షాకిస్తుంది. 
 

36
photo- jabardasth promo

జబర్దస్త్ వర్ష సిగరేట్లతో కాల్చుకోవడం, దానికోసం తహతహలాడటం షాకిస్తుంది. వర్షకి భర్త రియాజ్‌. అతను 12 గంటలు చిన్నగా, 12 గంటలు పెద్దగా మారిపోతాడు. అర్థ రాత్రి 12 అయిన తర్వాత పెద్దగా అవుతాడు. ఈ క్రమంలో రియాజ్‌తో శోభనం చేసుకునేందుకు నో చెబుతుంది వర్ష. ఆ సమయంలో అర్థ రాత్రి తర్వాత తాను పెద్దగా అవుతానని చెబుతాడు. అన్నట్టుగానే పెద్దగా మారిపోతాడు. ఇమ్మాన్యుయెల్‌ అవుతాడు. అది చూసి ఏమండీ అంటూ ఇమ్మూని హగ్‌ చేసుకుంటుంది వర్ష.
 

46
photo- jabardasth promo

అనంతరం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వర్షని చూసి `ఏం చేస్తున్నావే లోపల` అంటాడు ఇమ్మాన్యుయెల్‌, మీకోసమే ఎదురుచూస్తున్నానండీ అంటుంది వర్ష. ఎర్రచీర కట్టుకుని బాగా రెడీ అయి ఉంది. ఆమెని చూసిన ఇమ్మాన్యుయెల్‌ తాగే సిగరేట్‌ని ఆమె చేతులపై కాల్చే ప్రయత్నం చేస్తుంటాడు. దెబ్బకి ఆమె అబ్బ అబ్బా అంటూ రొమాంటిక్‌ సౌండ్లు చేసి ఇక్కడ కాల్చండి, ఇక్కడ కాల్చండి అంటూ పైట కొంగు తీసి మరి వీపు చూపించడం గమనార్హం. 
 

56
photo- jabardasth promo

దీనికి ఇమ్మాన్యుయెల్‌.. ఆమె ప్రవర్తన చూసి షాక్‌ అవుతాడు. నేను సిగరేట్లు తాగుతున్నా అనుకుంటున్నావా? కాఫీ తాగుతున్నా అనుకుంటున్నావా? ఇక్కడ ఇక్కడ అంటున్నావ్‌ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జబర్దస్త్ ప్రోమోలోని ఈ స్కిట్ నవ్వులు పూయించింది. ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది. కానీ జబర్దస్త్ వర్షకి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తుండటం విశేషం. 
 

66
photo- jabardasth promo

ఇమ్మాన్యుయెల్‌, జబర్దస్త్ వర్ష.. జబర్దస్త్ షోలో మంచి పెయిర్‌గా రాణిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరు చేసిన లవ్‌ ట్రాక్‌లు బాగా పేలాయి. నిజంగానే ఈ ఇద్దరు లవర్స్ అనేంతగా వర్కౌట్‌ అయ్యాయి. అంతేకాదు అలాంటి రూమర్లు కూడా ఫేస్‌ చేశారు. దీంతో కొన్నాళ్లు షో కూడా మానేసింది వర్ష. ఆ తర్వాత ట్రోల్‌ ఫేస్‌ చేసంది. దాన్నుంచి తేరుకుని మళ్లీ షోకి వచ్చింది. కాకపోతే ఈ సారి మరీ డ్యూయెట్లు, ఎంగేజ్‌మెంట్లు, పెళ్లిళ్లు, ప్రపోజల్స్ లేకుండా డైరెక్ట్ గా పాయింట్‌ మీద కామెడీ చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories