తెలుగు, హిందీ, తమిళ్ చిత్ర పరిశ్రమల్లో తన నటనతో గుర్తింపు పొందిన హీరోయిన్ రాశీ ఖన్నా, ప్రస్తుతం వివిధ భాషలలో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ముక్కు నుంచి రక్తం కారుతూ, కాళ్లకు, చేతులకు గాయాలు అయ్యి రక్తం కారుతున్నట్లు కనిపిస్తోంది.