Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?

Published : Jun 18, 2026, 07:55 PM IST

మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. ఈసినిమాతో టాలీవుడ్ మరో రేంజ్ కు వెళ్లే అవకాశం ఉంది. వారణాసి తరువాత రాజమౌళి నెక్ట్స్ సినిమా ఎవరితో?

PREV
15
తెలుగు సినిమాను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన దర్శకుడు..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన చేసిన సాహసం వల్లే.. టాలీవుడ్ కు ఇంత పేరు వచ్చింది. జక్కన్న వేసిన బాటలలో ఇప్పుడు చాలామంది దర్శకులు ఫాలో అవుతున్నారు. రాజమౌళి కి దర్శకుడిగా దేశవ్యాప్తం గుర్తింపు వచ్చినా.. హాలీవుడ్ లో జేమ్స్ కామరూన్ లాంటి దర్శకుడి ప్రశంసలు అందుకున్నా కానీ.. టాలీవుడ్ హీరోలతోనే తను అనుకున్న స్థాయిలో సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాన్ ఇండియా సినిమాలు చేసిన జక్కన్న ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీనే చేస్తున్నాడు. మరి జక్కన్న నెక్ట్స్ మూవీ ఎవరితో?

25
రాజమౌళిని ని ఫాలో అవుతున్న దర్శకులు..

రాజమౌళి తో అద్భుతమైన రెండు సినిమాలు చేసిన హీరో రామ్ చరణ్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మగధీర, ఆర్ఆర్ఆర్ చిత్రాలు తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. మగధీర రిలీజ్ కు ముందు తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి నిర్మాతలు, దర్శకులు, హీరోలు కొంత వెనుకంజ వేసేవారు. టాలీవుడ్ లో కమర్షియల్, ప్రేమకథలు, ఫ్యాక్షన్ మూవీస్ మాత్రమే ఎక్కువగా తెరకెక్కేవి. మగధీర సక్సెస్, కలెక్షన్లు చూసిన తరువాత అందరికి ధైర్యం వచ్చింది. భారీ స్థాయి చిత్రాల నిర్మాణం కూడా పెరిగిందనే అభిప్రాయంఉంది.

35
నలుగురు హీరోలను రిపీట్ చేస్తున్న జక్కన్న

ఇక రాజమౌళి ఎక్కవగా హీరోలను, హీరోయిన్లను రిపీట్ చేయడు. ఆయన రిపీట్ చేసిన హీరోలు ముగ్గురే ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్. ప్రభాస్ తో మూడు సినిమాలు చేసిన జక్కన్న ఎన్టీఆర్ తో ఏకంగా నాలుగు సినిమాలు చేశాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రెండు సినిమాలు చేశాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ తో రాజమౌళి కాంబినేషన్ లో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ ను కూడా సాధించింది. ఇలా రాజమౌళి చరణ్ ను లక్కీగా ఫీల్ అవుతున్నాడట. అందుకే మహేష్ బాబు తరువాత చరణ్ తో ఆయన ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. కానీ ఈ విషయంపై అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం లేదు. ఇండస్ట్రీలో టాక్ మాత్రం వినిపిస్తోంది.

45
వారణాసి తరువాత రామ్ చరణ్ తో సినిమా?

మూడోసారి రామ్ చరణ్, రాజమౌళి కలిసి పనిచేసే అవకాశాలపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాజమౌళి వారణాసి ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. వారణాసి పూర్తయిన వెంటనే రామ్ చరణ్‌తో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం చారిత్రక నేపథ్యంతో రూపొందే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

55
జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడా?

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా చెప్పబడుతున్న గరుడ పై కూడా మళ్లీ ఆసక్తికర చర్చ స్టార్ట్ అయ్యింది. రాజమౌళి కి దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో వారణాసి చిత్రం తర్వాత రామ్ చరణ్‌తో కలిసి గరుడ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. పై సినీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

Read more Photos on
click me!

Recommended Stories