టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్‌ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న భారీ ప్రాజెక్ట్ SSMB29 గురించి మరో క్రేజీ వార్త బయటకు వచ్చింది. మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకు సంబంధించి తమిళ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట జక్కన్న.
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరెక్కుతున్న మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. అయితే ఈ మూవీకి సబంధించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం తమిళ స్టార్ హీరో విక్రమ్‌ను మహేష్ బాబు సినిమాలో కీలక పాత్ర కోసం రాజమౌళి సంప్రదించారని సమాచారం.
26
vikram, aparichithudu, thangalaan
విశ్వసనీయ సమాచారం ప్రకారం, “రాజమౌళి విక్రమ్‌తో సినిమా గురించి చర్చించారని తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఏమీ ఖరారు కాలేదు. మహేశ్ బాబు స్థాయికి తగ్గ ప్రతిష్ట, ప్రజాదరణ ఉన్న నటుడిని ఈ పాత్రకు తీసుకోవాలనుకుంటున్నారు. విక్రమ్ ఈ క్రైటీరియాలకు పూర్తిగా సరిపోతాడు,” అనే అభిప్రాయం రాజమౌళిలో ఉన్నట్టు తెలుస్తోంది.
36
ఇప్పటికే ఈసినిమాలో పృధ్విరాజ్ సుకుమారన్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అంతే కాదు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈక్రమంలో ఈసినిమా స్థాయిని మరింతగా పెంచేందుకు. పాత్రకు తగ్గ స్టార్ కోసం రాజమౌళి చూస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో రాజమౌళి మరో భారతీయ స్టార్‌ను ఈసినిమాలో జాయిన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు కొత్తే కాదు. ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘పొన్నియన్ సెల్వన్’ వంటి బ్లాక్‌బస్టర్లతో ఆయనకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళనాట అయితే ఆయన అభిమానలుగ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా బహుభాషా రూపంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలన్న రాజమౌళి లక్ష్యానికి విక్రమ్ తోడైతే బాగుంటుంది అని అభిప్రయాయపడుతున్నాడట జక్కన్న.
56
Rajamouli
ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే, మహేశ్ బాబు మరియు విక్రమ్ తొలిసారిగా స్క్రీన్‌ను షేర్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం చర్చలు మాత్రమే జరుగుతున్నాయని సమాచారం. విక్రమ్ చివరి సినిమా ‘వీర ధీర సూరన్ 2’ బాక్సాఫీస్ వద్ద సాధారణ విజయమే సాధించింది, ఈ మధ్యలో విక్రమ్ సినిమాలేవి పెద్దగా నడవలేదు. మరి ఆయన ఈ పాత్రకు సై అంటాడే లేదా చూడాలి.
66
SSMB29 తెలుగు సినీ పరిశ్రమలోనే కాక, భారతీయ సినిమాకే ఒక మైలురాయిగా నిలవాలన్నRajamouli లక్ష్యం నేరవేరుతుంది. పాన్ వరల్డ్ సినిమాను జక్కన్న అందించగలరా లేదా అనేది చూడాలి.